ఇంకా దిగజారనున్న స్థితికి జగనే కారణమా?
స్థాన బలం ఎంతటిదో గజేంద్ర పురాణంలో, ఏనుగును మడుగులో వున్న ముసలి పట్టిన పట్టు ద్వారా, మనకు తెలిసిందే.గత రెండు మూడు రోజులుగా, జగన్ తో పాటు పాదయాత్రలో ప్రక్కనే నడిచే ఆయన పార్టీ రాష్ట్ర శాఖ నేత గురించి ఆయనకు తెలియదు. రోజూ ఓ చీరలో వచ్చి ఆమె పాల్గొంటుంటే, అవకాశం ఇస్తున్నారే గాని స్థానికం వున్న నాయకులకు ఆ అవకాశం ఇవ్వడం లేదు. పోనీ ఆవిడ గురించి ఎవరికైనా తెలుసా అంటే ఎంపిటిసి, సర్పంచ్ కాదు కదా తన వార్డులో మెంబర్ ను కూడా గెలిపించే సామర్థ్యం లేదు, ఎవరికీ తెలియదు. పెద్ది రెడ్డిని పంపి, మండల స్థాయి కాంగ్రెస్స్ నాయకులను గాని తన సామాజిక వర్గ నాయకులను గాని తన దగ్గరకు మరియు పాదయాత్రకు రప్పించుకోలేక పోతున్నారు. కనీసం కలవాలనే ఆసక్తి కూడా లేనట్టుంది.
అస్సలు ఎందుకు జగన్ వైపు చూడ్డంలేదో తెలుసా? ఒకటి నమ్మకం లేదు. అయినా పాదయాత్రలో పార్టీల కతీతంగా ఆత్మీయంగా ఎందుకు కలవడం లేదో తెలుసా? జగన్ వైఖరి. గతంలో ఓ సారి, మాజీ మహిళా మంత్రి అనుచరుడు, తన సామాజిక వర్గం అని అభిమానంతో రాత్రి బసకు జగన్ ను ఇంటికి ఆహ్వానించాడు. ఆ ఇంటికి అతిధిగా వెళ్లిన జగన్, మేడ మీద గదిలోకి దూరి, ఆ ఇంటి పెద్దనే కలవను కుదరదని సెక్యూరిటీతో చెప్పించాడు. జగన్ ను ఆహ్వానించన నేతకు కోపం నసాలానికి వచ్చి, నా ఇంటికి వచ్చి నన్నే కలవడా అని, బండబూతులు తిడితే ఆయన కుటుంబ సభ్యులు సముదాయించారు. ఏదో సినిమాలో, ప్రకాశ్ రాజ్ ఒంటరిగా నూలు పోగు లేకుండా తాగుతూ కనిపిస్తాడు, రాత్రైతే. ఆ సినిమా గుర్తుకు వచ్చిందట, ఈ గలాభా విషయం తెలిసిన వారికి.
జనాన్ని ఎలాగో ఒక లాగా పట్టుకు రాకపోతే తమకు ఇబ్బందని, స్థానికంగా రకరకాల ప్రలోభాలతో పట్టుకొచ్చినా, వెల వెలబోతోంది పాదయాత్ర. అయినా మీడియా గ్రాఫిక్స్ తో ప్రభజనం కోసం అలసిపోకుండా గజినీలా ప్రయత్నిస్తున్నారు.
తెలిసిపోతోంది మరో ఓటమి తప్పదని, ఖర్చు తక్కువతో ప్రతిపక్షం గా నిలవడానికి జరుగుతున్న ప్రయాసా ప్రయత్నం కోసం, తెలివి వున్న స్థానికులు తమ బతుకులు బలిపెట్టరు కదా? ….చాకిరేవు.
0 Responses to “ఇంకా దిగజారనున్న స్థితికి జగనే కారణమా?”