జనవరి 11th, 2018ను భద్రపఱచు

మేనిఫెస్టోలో లేని జన్మభూమిలో సాధించింది ఏమిటి?

మేనిఫెస్టోలో లేని జన్మభూమిలో సాధించింది ఏమిటి?

ఒకప్పుడు ప్రభుత్వ పథకం అంటే మీడియాలో ఆర్భాట ప్రకటన లా వచ్చేది. ఆ పథకం పొందాలి అంటే అదో బ్రహ్మ విద్య. దానిని పొందడానికి, ఆశతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, చెప్పులు అరిగించుకొంటూ నిస్పృహతో మధ్యలోనే దండం పెట్టేసే వారు. ఎందుకంటే విఆర్ఒ దొరికితే ఆర్ఐ దొరకడు, ఆర్ఐ దొరికితే ఎంఆర్ఒ దొరకడు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తారో ఆ కార్యాలయాలలో, కసురుకొని కూడా చెప్పేవారు కారు.

ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టని కార్యక్రమం, ప్రజల వద్దకు పాలన మరియు జన్మభూమి, కార్యరూపం దాల్చింది, దశాబ్దమన్నర క్రితం బాబు హయాంలో. అదో వింత, దేశంలో అదో సంచలనం. సమస్యల మీద అక్కసుతో వున్న ప్రజలంతా కసితో నిలదీసేవారు. అధికారుల్లో, అలసత్వం పోయింది. సమస్యలు ఎన్నో కొలిక్కి వచ్చాయి. పథకాలు అర్హులకు చేరేవి.

మరో దశాబ్దం వై ఎస్ మొదలు దానిని అటకెక్కించారు. మళ్లీ జనం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పాత రోజుల బాధలు అనుభవించారు.

ఇప్పుడు ఎన్నో ప్రభుత్వ పథకాలు, అవి ప్రవేశపెట్టినప్పుడు, తాము ఇళ్లలో లేకపోవడమో, అప్పటికి అర్హత లేకపోవడమో? అసలు అలాంటివి వున్నాయని తెలియకపోవడం. ఎన్నో సందేహాలు, ఆశలు, బాధలు మరియు సమస్యలు.

అవన్నీ పండగల్లా చర్చించడానికి, మళ్లీ బాబు రాకతో, జనహితం కోసం జనం మధ్యకు అధికారం కదిలింది. జనంతో కలిసిపోయింది.

వీలైతే అప్పటికప్పుడు, అక్కడికక్కడ ఎన్నో వేల సమస్యలు తీరిపోయాయి.

అధికారులకు ప్రజలకు వారధి అయ్యి ఎన్నో అవగాహనకు వచ్చాయి. కార్యాలయ దస్త్రానికి వాస్తవిక దృశ్యానికి తేడా తెలిసింది.

సమస్య అంటే ఎవరికీ తెలియకుండా లంచమిచ్చి తీర్చుకొనేది కాదని, అవసరమైతే 1100 అస్త్రాన్ని సంధిచి సాధించే అర్హత వుందని ప్రజలకు అవగాహన వచ్చింది.

ఇంకా దేశం ఔరా అని చూస్తోంది, మనకు సాధ్యం కాదులే ఈ సాహసాలు అని. …..చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • ఓ ఉత్తరాంధ్రా అబ్బాయి ఎర్రం నాయుడి అబ్బాయి ఇటీవలే ఓ ఇంటివాడైన అబ్బాయి పార్లమెంటులో ఎలా మాట్టాడాడో ఓ వంద సార్లు… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 837,707

తడి ఆరని ఉతుకులు

జనవరి 2018
సో మం బు గు శు
« డిసెం   ఫిబ్ర »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: