పోలవరం కాంగ్రెస్స్ మానస పుత్రిక
తులసి రెడ్డి గారు,
పోలవరం కాంగ్రెస్స్ మానస పుత్రికే, కాదని ఎవరూ అనడం లేదు. కాని ఇంకో రెండు దశాబ్దాలు కూడా, ఇలాగే చెప్పుకొంటూ తరిస్తే, పోలవరం గర్భంలో వున్న శతాధిక పుత్రిక కూడా అవుతుంది. మీ కాంగ్రెస్స్ పార్టీలో, ఇన్నాళ్లూ పోలవరం, దోపిడీదారులకు ఓ వరం. దమ్మిడీ దమ్ము లేక, ముంతడు నీరు ఇవ్వకుండా, జలయజ్ఞ చేసి జలగల్లా జనం రక్తం తాగింది చాలు.
మూడు వేల కోట్ల లోపు భూసేకరణ ను జలయజ్ఞ బకాసురుడు రాజన్న తో చెయ్యించ చేతకాని చెయ్యి మీది. కనీసం, ఆయన పెడుతున్న ఐదు వేల కోట్ల ఖర్చుకు ముందు, మన రాష్ట్రం తరపున రాజ్యసభకు పంపిన మీ జై రాం రమేష్ దగ్గర, ఎన్విరాన్మెంటల్ క్లియరన్స్ లు తెచ్చుకోలేని దద్దమ్మల ప్రభుత్వ నిర్వాహకాలు మీవి. రాష్ట్రం ముందు ఇవన్నీ దాస్తే దాగేవా?
మూడేళ్లలో తల్లి పిల్ల కాంగ్రెస్స్ లు బిజెపి లు మూడు ప్రక్కలా, ఇబ్బంది పెడుతున్నా, ఓ కొలిక్కి తెచ్చారు బాబు గారు. బిజెపి మెడకు చుట్టి పూర్తి చెయ్యక తప్పని పరిస్థితిని కల్పించిన బాబు చాతుర్యం రాష్ట్రానికి తెలుసు. ఇవన్నీ మీకు తెలిస్తే, అర్థం అయితే విభజన చేసి సమాధి స్థితి పొందే వారు కారు. …చాకిరేవు.
0 Responses to “పోలవరం కాంగ్రెస్స్ మానస పుత్రిక”