జనహితం కోసం పాటుపడుతున్న సాక్షికి అభినందనలు

జనహితం కోసం పాటుపడుతున్న సాక్షికి అభినందనలు

బాబు వస్తే జాబు వస్తుంది అని, గత ఎన్నికల్లో, ఐ టి ఉద్యోగులు చేసిన ఉద్యమంతో, జగన్ కు సిఎం జాబు పోయింది. ఆ నినాదం అంటే జగన్ నిలువెల్లా వణికిపోతాడు, మనసు పుండు చేసుకొన్నాడు. దానికి తగ్గట్టు, రాజకీయ చదరంగంలో బాబు లోకేశ్ ని ముందుకు పెట్టి, లక్షల కోట్ల పెట్టుబడులను, వేలాది ఉద్యోగాలను తెప్పిస్తున్నాడు, రాష్ట్రానికి.

ఇది రుచించని జగన్, ఇప్పటికీ మరిచిపోకుండా, ప్రతి సభలో, వెటకారం రూపంలో జనానికి గుర్తు చేస్తూనే వుంటాడు, ఉద్యోగం ఎవరికన్నా వచ్చిందా అని. ఉద్యోగం వచ్చిన వాడు, మన సభకు ఎందుకు వస్తాడు అనే స్పృహ లేకుండా. జగన్ సభకు వెళ్లేంత తెలివి తేటలు వున్న వాడికి ఉద్యోగం ఎప్పటికీ రాదు, అది వేరే విషయం. కాని ఇది మరింత మేలు చేస్తోంది లోకేశ్ శ్రమకు.

జగన్ కు తోడుగా సాక్షి కూడా వెటకారం చేసున్నామని, లేని పోనివి రాస్తుంది. ఈ రోజు, వెటకారానికి పరాకాష్టగా పిచ్చిగా, 80 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని బాబు గారు చెప్పినట్టు వ్రాసింది. ఈ వార్త చదివిన, నిజమైన నిరుద్యోగి ఏమి చేస్తాడు? అనుమానంతో మరో రెండు పేపర్లు చూస్తాడు. అందులో ఇంత వెటకారం కనిపించదు. అప్పుడు ఏమవుతుంది. సాక్షి పేపరు ఓ పిచ్చి పేపరని ఓ అవగాహనకు వస్తాడు. అందులో జగన్ కు తోలుకొని వచ్చే నిజమైన జనం ఫోటో పెట్టినా, ఏ హామీలు ఇచ్చినా కాని ఆ నిరుద్యోగి నవ్వుకొంటాడు. అంటే సాక్షి జర్నలిస్ట్ లే తమ పత్రికను తమకు తాము పిచ్చి పత్రికగా ముద్ర వేస్తున్నారు.

వీరి నైపుణ్యం చూసే, పాలక పార్టీ లో ఎవరూ కూడా ఖండించరు. అంటే పట్టించుకోవడం లేదు. పట్టించుకొనే పాఠకుడికి, మనసులో కూడా తన పిచ్చిని తనే ముద్రిస్తోంది. ఈ విధంగా, జగన్ కు సి ఎం జాబు రాకుండా, జనహితం కోసం పాటుపడుతున్న సాక్షికి, మనం అభినందనలు తెలియజేయాల్సిన బాధ్యత వుంది. …..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “జనహితం కోసం పాటుపడుతున్న సాక్షికి అభినందనలు”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 817,862

తడి ఆరని ఉతుకులు

జనవరి 2018
సో మం బు గు శు
« డిసెం   ఫిబ్ర »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: