జనవరి 10th, 2018ను భద్రపఱచు

ఇది ప్రజా యాజమాన్య ప్రకటన – రాష్ట్రంలో ఉద్యోగాలకు ఖాలీ లేవు

ఇది ప్రజా యాజమాన్య ప్రకటన – రాష్ట్రంలో ఉద్యోగాలకు ఖాలీ లేవు

సిఎం ఉద్యోగానికి బూట్లరిగేలా తిరుగుతున్న అభ్యర్థుల్లారా,

మీకు తినడంలో వున్న అనుభవాన్ని
ప్రస్తుత రాష్ట్ర ప్రజా యాజమాన్యం
భరించే స్థితిలో లేదు

ప్రతి సారి మీరు గల్లా ఖాలీ చేసి ఇచ్చినా భరించాము
పోతూ పోతూ దెయ్యం కొమ్మ విరిచి పోయినట్టు
చెయ్యి మరియు దేశం మొత్తం చేరి
చిరిగిన విస్తరి చేసారు

మండే గుండెలతో
అవశేషం అనే హేళనల మధ్య

మేము భయంతో కసితో
ధైర్యం తెచ్చుకొని గుర్తుకు తెచ్చుకొని
అనుభవం వున్న పెద్దాయన తిరగాడుతుంటే
లెంపలేసుకొని ఆయన చేతిలో పెట్టాము

ఇలా అప్పగించారని
ఆయన ఏమీ ఆషామాషీగా తీసుకోలేదు
కొన్ని నెలలు బస్సులో పడుకొని
ఆయన తన వయసు మరచిపోయి మరీ
రేయింబవళ్లు బాగా కష్టపడి
ఇప్పుడిప్పుడే కుదుటున పడేస్తున్నాడు

రాజధాని అమరావతి, పోలవరం, పోర్టుల భూములు
మేము రుణం తీసుకొనే చోటల్లా
ఫిర్యాదులు చేస్తూ కేసులు పెడుతూ
నెత్తిన పెట్టి ఏలుకోమనే వేడుకోలుకు
కరిగే వెఱ్రితనం లేదు ఇప్పుడు మా దగ్గర
ఆ రోజులు పోయాయి

ఆ కేసులు ఫిర్యాదుల కుట్రలను తట్టుకొని
ఒక్కోటి చేధిస్తూ చేయి కూడదీసుకొంటున్నాము

డజన్ల కొద్ది 420 కేసులున్నా
ముఖ్యమంత్రి ఉద్యోగం ఇచ్చే
అనాగరిక రాష్ట్రం కాదు ఆంధ్రా

అమరావతి పోలవరం లాంటి
ఎన్నో పనులతో
ఇప్పటికే దేశానికి ఆదర్శం అయ్యి
అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతూ
అందరినీ ఆకర్షిస్తున్న రాష్ట్రం

ఉద్యోగం రాలేదనే అక్కసుతో
ఉన్మాదానికి పాల్పడితే
అంతర్జాతీయ ప్రమాణాలతో
అమరావతిలో కట్టే
కారాగారం ఖాయం

కుల మత రిజర్వేషన్లతో ఆశపడితే
రాష్ట్రం అసహ్యించుకొంటుంది. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 858,983

తడి ఆరని ఉతుకులు

జనవరి 2018
సో మం బు గు శు
« డిసెం   ఫిబ్ర »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: