జనవరి 3rd, 2018ను భద్రపఱచు

దేవుడి కడప ఎంపి, వై ఎస్ అవినాష్ రెడ్డి గారికి,

దేవుడి కడప ఎంపి, వై ఎస్ అవినాష్ రెడ్డి గారికి,

ఈ రోజు పార్లమెంటుకు వెళ్లకుండా, సెలవు పెట్టి జన్మభూమి లో పాల్గొన్నందుకు సంతోషం. గండికోట చిత్రావతి ప్రాజెక్టును, రాజశేకర్ రెడ్డి 2009 లో చనిపోయేనాటికే, 85 శాతం పూర్తి చేసాడు అనుకొందాం. ఆయన తమ్ముడు వివేకా, 2012 వరకు కాంగ్రెస్స్ లో వున్నాడు. వ్యవసాయ శాఖ వెలగబెడుతూ, ఆ మూడేళ్లలో మిగిలిన 15 శాతం పనిని, ఉమ్మడి రాష్ట్ర మిగుల నిధులు వాడి ఎందుకు పూర్తి చెయ్యించలేక పోయాడు? విజయమ్మ, సభలో ఏ రోజూ ఆ 15 శాతం పనులకోసం, ఎందుకు అడగలేదు.

వదిన విజయమ్మ ను ఢీకొన్నట్టు, వదిన మరుదులు, పులివెందుల ఉప ఎన్నికల నాటకం, రక్తి కట్టించారని అక్కడి ప్రజలకు తెలియదా?

ఆ నాటకం ఆడిన నాటికే నైతికంగా, మానసికంగా వై ఎస్ కుటుంబం పులివెందులలో ఓడిపోయింది. పులివెందుల పులులు అని పొంగిపోయే మీ కుటుంబం ఆడింది, ఇరు పార్టీల నుండి, ఎలుకా పిల్లుల ఎన్నికల నాటకం.

ఇందుకు కదూ మీ బాబాయి వివేకా ను ఎం ఎల్ సి గా కూడా తుక్కు తుక్కు గా ఓడించింది.

అతిథి దేవో భవ సీమ సంస్కృతి. అడ్డగించడం మన ఫ్యాక్షన్ సంస్కృతి.

సొంత పులివెందుల అభివృద్ధికి కూడా అడవి మృగాల్లా ఎవరు అడ్డుపడుతున్నారో, ప్రజలు గమనిస్తున్నారు. అసలు సిసలైన సీమ బిడ్డ, మీ గడ్డ పులి బిడ్డ, గెడ్డం పెంచుకొని, నిత్యం ముఖ్యమంత్రికి కనిపిస్తే, చూడలేక, మూడేళ్లలో బాబు గారు, పెద్ద మనసుతో గండికోట చిత్రావతి పూర్తి చేసారు. శత్రువు గడ్డ అని మీరు చూస్తారు. వాళ్లు ప్రజలు అని ముఖ్యమంత్రి చూసారు. ఇంకా పాళేగాళ్ల వారసత్వ పోకడలతో, ప్రజాస్వామ్యంలో అడుగడుగునా, రాష్ట్ర అభివృద్ధికే కాదు సొంత ప్రాంత అభివృద్ధి కి కూడా కుళ్లుమోతు తనంతో అడ్డుపడుతున్నారు అంటే, మానవత్వం ఏ మాత్రం మిగిలివున్నట్టు లేదు.

ఆ గడ్డలో పెద్ద ఫ్యాక్షన్ పుడింగులు పుట్టి వుండచ్చు, మీ తాతల రూపంలో, కాని అంతకు ముందు మహా యోగులు వేమన, అన్నమయ్య, కాలజ్ఞాని వీర బ్రహ్మయ్య లాంటి మహా మహులు, ఆ దేవుడి కడపలో పుట్టారు.

పూర్వకాలపు రాక్షత్వం, ఏదో రూపంలో మిగిలి వున్నా, తిరగాడుతూ అక్కడ అడ్డుపడుతున్నా కూడా, కాలరాయబడే సమయం, ఆసన్నమయ్యింది. అది దేవుడి కడప కాబట్టి, ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. పోగాలానికి పోయే ఎవడికీ, మానవసేవ మాధవ సేవ అని పోయే వరకు తెలియదు. …చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 858,985

తడి ఆరని ఉతుకులు

జనవరి 2018
సో మం బు గు శు
« డిసెం   ఫిబ్ర »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: