నవంబర్ 24th, 2017ను భద్రపఱచు

గొడ్డలికి కన్నీరు తెప్పించిన కసాయి

గొడ్డలికి కన్నీరు తెప్పించిన కసాయి

అంతర్జాతీయ డిమాండు అధికంగా వున్న బాక్సైట్, మన రాష్ట్రంలో వుంది. కాని, వేల కోట్ల విలువైన దానిని ఇంటర్నేషనల్ డెకాయిటీ గ్యాంగుకు అమ్మేసారు, ముడుపులు తీసుకొని. ఆ ముడుపులు హవాలాద్వారా అమెరికా గడ్డ లోని కొన్ని కంపెనీలు వాడుకొన్నారని, అమెరికా ఎఫ్‌బిఐ కేసు నమోదు చేసింది, అందులో వై ఎస్ ఆర్ మరియు కె వి పి పేర్లు చేర్చారు. దాని దర్యాప్తు కోసం, స్వీడిష్ లో వున్న దిమిత్రీ ఫిర్టాష్ ని అమెరికా కు దిగుమతి చేసుకోవడం కోసం అమెరికా అభర్థన, విచారణలో వుంది.

కాని మన్యంలో గిరిజనులకు ఇవన్నీ తెలియదు.

ప్రజల మనసులను గెలిచి, తను గెలిచిన గిరిజన మహిళా ప్రజా ప్రతినిధి, గొడ్డలితో నరికేస్తా అని ఓ ముఖ్యమంత్రిని అనగలదా? చెప్పిస్తే అనగలదు అన్నింటికీ పడే చంద్ర బాబు లాంటి వారు వుంటే.

అసలు ఎందుకు ఆ మాట అందో తెలుసా? కేంద్రంతో కలిసి బాక్సైట్ మైనింగ్ చేయబోతున్నారు, రద్దు చెయ్యండి అని. కాని అదే అమాయక గిరిజనులు అంత మాట, ఇంటర్నేషనల్ డెకాయిటీ గ్యాంగ్ తో కలిసి అమ్మేసినప్పుడు అనలేదు. వారి అమాయకత్వం.

సమస్య సృష్టించింది, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కాని వుసిగొలిపింది చంద్ర బాబు మీద.

తమ గొడ్డలిగా మార్చుకొన్న గిడ్డి ఈశ్వరిని ఈ రోజు ఏడిపిస్తున్నారు, అదే వైకాపాలో. పాపం పండింది. ఈ పనామా, ప్యారడైజు పేపర్ల కంటే ముందే, ఎఫ్‌బిఐ కేసు పత్రాలలో, మన రాష్ట్ర డెకాయిటీలకు ఎలా హవాలా డబ్బులు వచ్చాయో విశదంగా వుంది. మన దేశం ఇంకా దర్యాప్తు చేయడం మొదలెట్టలేదు. స్వీడిష్ కోర్టులో కూడా అమెరికా అదే చెప్పింది. ముడుపులు తీసుకొన్న భారత దేశం వదిలిందని మేము వదలాలి అని లేదుగా. మా గడ్డ మీద జరిగింది కాబట్టి విచారణ చేస్తాం, అని భీష్మించింది. వై ఎస్ ను ఆ డెకాయిటీ గ్యాంగు కలిసిన దగ్గర నుండి హవాలా ముడుపుల వరకు ఆడియో టేపులు కూడా ఎఫ్‌బిఐ సేకరించింది. ఆలస్యం అవ్వొచ్చు, ఇక్కడ పోలవరం కోసం కేసులు వేస్తున్న ఆత్మ కె వి పి కూడా తప్పించుకోలేడు.

ఆ గిరిజనులకు ఇవన్నీ తెలిస్తే నిజంగా వీళ్ల మీద నూరుతారు గొడ్డళ్లు. అంతర్జాతీయ స్థాయి దొంగల యవ్వారాలు అర్థం కావు. కాని ప్రకృతి ఊరుకోదు. పాపం పండినప్పుడు. చూస్తూనే వున్నాం. ……..చాకిరేవు

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,539

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2017
సో మం బు గు శు
« అక్టో   డిసెం »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: