నవంబర్ 20th, 2017ను భద్రపఱచు

ప్రశాంత్ కిషోర్ మన రాష్ట్రంతో తన వృత్తి కి వీడ్కోలా?

ప్రశాంత్ కిషోర్ మన రాష్ట్రంతో తన వృత్తి కి వీడ్కోలా?

ఫేక్ అకౌంట్లతో, ఉత్తర భారత దేశంలో చెల్లుబాటు అయ్యే పని, అంతే సులభంగా ప్రస్తుతం చేతిలో వున్న ఒక్క కస్టమర్ వైకాపా విషయంలో కానిచ్చేద్దామనుకొన్నాడు. దిగితే కాని, లోతు తెలిసి రాలేదు. కష్టం ముప్పేటలా ఎదురయ్యింది.

ఒకటి, వైకాపా ప్రత్యర్థి బాబు, జాతీయ స్థాయి రాజకీయ చాణిక్యుడు. పదమూడు జిల్లాల లో తన పనిని, ప్రత్యర్థి పార్టీలతోనే ప్రచారం చెయ్యిస్తున్న మేధావి. మనమే ప్రచారం చేస్తున్నాం అని కనీసం వ్యూహకర్త ప్రశాంత్ కూడా ఇంకా మేలుకోలేక పోతుండడం లోనే అద్దం పడుతోంది బాబు రాజకీయం.

రెండు తన కస్టమర్ వైకాపానే పెడుతున్న కష్టాలు. ఏకవీరుడు జగన్, ఎవరినీ నమ్మడు. నమ్మిన వాడు పార్టీలో వుండడు. కకావికలు అవుతున్న సైన్యం. దానికి తోడు, తప్పును సరిదిద్దుకోలేని నైజం. పరాకాష్టగా, తన పరాజయానికి తన నోటినే ఆయుధంగా ప్రత్యర్థులకు అప్పగించడం లోని అహంకారం. పూర్తిగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను కిమ్మని వినమని తన దళాలను ఆదేశించే స్థాయిలో లేడు ప్రస్తుతం, గట్టిగా చెబితే మరుసటి రోజే మరో పార్టీ అవకాశం వస్తోంది వారికి.

మూడు, తెలుగు సోషల్ మీడియా సైన్యం. వీరిది అభివృద్ధి భావజాలం మరియు ప్రపంచ సాంకేతిక నైపుణ్యం. ఈ సైనికులు, స్లీపర్ సెల్స్ లా అజ్ఞాతంగా వుంటారు. కనీసం తెలుగుదేశం లో నాయకులకు కూడా వీరు ఎవరు అని తెలియదు. ఒక్కో సారి నోరు జారిన లోకేశ్ అయినా ప్రభుత్వ తప్పు అయినా వదిలిపెట్టరు. రెండు వైపులా కత్తి త్రిప్పే సైన్యం. ఇలాంటి వారి పని బాబుకు పనికి వచ్చేది గా వున్నా ఏ రోజూ ఆయనతో ఫోటోకు గాని కనీసం తిరుపతి లడ్డూకు లేఖ అడగడాన్ని కూడా ఆశించరు. వారి వారి ఉద్యోగాలతో పాటు, వ్యంగ్య & హాస్యంతో బహిరంగంగా, గంటల్లో చుట్టుముడతారు. వీరికి తోడు, కల్ట్ తెలుగు దేశం సైన్యం. ఏ స్థాయి అంటే, జగన్ సతీమణి పెట్టిన చిత్రాన్ని, ఒకే రోజులో తీసెయ్యించేలా, మీడియాలో అభాసుపాలయ్యేలా చెయ్యగలిగిన సత్తా వీరి సొంతం.. ఇలాగే, ఫేక్ అకౌంట్లతో పని చేస్తున్న ప్రశాంత్ బృందం లో తుఫాను సృష్టించారు. ప్రతి అకౌంట్ ని తొలగించేలా చేసి, వైకాపా కార్యాలయం నుండి వివరణ సంజాయిషీ ఇచ్చుకొనేలా చేసిన సత్తా గల సైన్యం.

ఇక వైకాపాలో కూడా వున్నారు, బూతులతో బరస్ట్ అవుతూ అరస్ట్ అవుతూ కుటుంబం, బంధువులు మరియు సమాజం ముందు దోషులుగా నిలబడే పరిస్థితి. పేరు వెనక తోక ను కూడా తీసేయడానికి ఇచ్చగించని అహంకారంతో, 16 నెలల జైలు తరువాత జనం ఎందుకు జగన్ ను కోరుకోవాలో చెప్పలేరు కాని బాబు పనులను పదే పదే విమర్శిస్తారు. జగన్ ను సమర్థిస్తే, సమాజం లో పరువు పోతుంది అనే గుబులు.

వీరికి తోడు, జగన్ తనకు సంబంధం లేదు అని ఈసడించుకొనే సొంత మీడియా సాక్షి. జన నీరాజనం, హారతుల పట్టిన జనం లాంటి పదాలతో తలనొప్పి వచ్చి టి వి నే ఆపేసేలా చేసే ప్రసారాలే కొంపముంచుతున్నాయి. ఓ పది మంది మేధావులు కాని, అనుభవం వున్న రాజకీయ నాయకుల చేతగాని జగన్ గొప్పతనం గురించి విశ్లేషణ చేయించుకోలేని బలహీనత. మాట్లాడించే ప్రతి ఒక్కడితో చంద్ర బాబు నామస్మరణ చేయిస్తూ మరింత సానుభూతి కలిగిస్తూ చేస్తున్న ఉపచారాలే.

అన్నీ అర్థం అయ్యాయి వ్యూహకర్తకు, కళ్లముందు కనిపిస్తోంది. కాడిమాను పడెయ్యడానికి కాదు గాని, ఎక్కువ మొత్తాల జీతాలు ఇస్తున్నారు. ఇది మనకు నేర్చుకోడానికి ఉపయోగపడుతుంది అని సొంత వ్యూహ బృందం సభ్యులకు సెలవిచ్చారట. ఆ కథనం ఇక్కడ మీరే చూడండి http://www.sundayguardianlive.com/news/11627-kishor-fades-political-oblivion.

మన రాష్ట్రం నుండి గౌరవ నిష్క్రమణ కూడా జరిగేలా లేదు, పి కె కి. అదటు వుంచితే, జగన్ బృందం చేసిన కల్తీ మద్యం లాంటి గత ఎన్నికల కేసుల్లో తగులుకోకుండా వీడ్కోలు తీసుకొంటాడేమో చూడాలనే కుతూహలమే ఎక్కువ నాకైతే.

ఏది ఏమైనా, జగన్ పార్టీలో కనీస స్థాయి పురోగతిని చూపి త్వరలో రాబోయే కర్ణాటక గట్రా రాష్ట్రాలలో క్లైంట్ ల ను సంపాదిద్దామనే ఆశ కూడా ఆవిరి అవుతోంది. ……చాకిరేవు

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,541

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2017
సో మం బు గు శు
« అక్టో   డిసెం »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: