నవంబర్ 9th, 2017ను భద్రపఱచు

మన రాష్ట్ర అదృష్టం

మన రాష్ట్ర అదృష్టం

ఓయి తెలుగువాడా అని
ఉద్వేగానికి గురయ్యాము
విడిపోయే ముందు

నేడు
విభజన అశాస్త్రియంగా చేసినా
విడిపోయి నెత్తిన పాలు పోసారు అనే
ప్రశాంతతకు వచ్చాము

విభజన రోజును
ప్రతి ఏడాది సంకల్పం చేసుకొంటూ
కసితో పోటీగా పరుగులో వున్నాము

హుద్ హుద్ ప్రళయం నుండి
ప్రతి పనిలో
ప్రతి అడుగులో
మన ధైర్యం నమ్మకం సామర్థ్యం
దేశానికి తెలిసేలా
ఒక్కో సారి ఆశ్చర్యపోయేలా
ఒక్కో సారి అవాక్కయ్యేలా
అడుగులు వేస్తూ వున్నాం

కాని అశాస్త్రీయ విభజన చేస్తూ
అవశేష ఆంధ్రా అని అనిపించిన
కాంగ్రెస్స్ కు వేసిన శిక్షలో
శేషంగా ఇప్పటి ప్రతిపక్షం నిలిచింది

సభ లోపలా బయటా
భరింఫ రాని విధంగా
బాధ్యత లేని విధంగా
జుగుప్త్సాకరంగా వారి ప్రవర్తనతో విసిగించి
మన తప్పటడుగులా నిరూపించారు

ఇప్పుడు వారికి వారే తప్పుకొన్నారు
అర్థవంత చర్చలకు
ప్రశ్నలకు సమాధానాలకు వేదిక అవుతోంది
అమరావతి వాస్తో ముహూర్తమో మరోటో

అమరావతిలో మొదటి సమావేశం జరిగి
ఎనిమిది నెలలలు కావస్తున్న ఈ సమయంలో
అష్టమ శని పోయి ప్రశాంతంగా
సభ జరుపుకొనే చరిత్ర
అదృష్టం మన రాష్ట్రానిదే
దానిని నెరవేర్చిన ప్రతిపక్ష పార్టీ
సభ్యులకు పేరు పేరునా కృతజ్ఞతలు …….చాకిరేవు

ప్రకటనలు

వీక్షణలు

  • 753,438

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2017
సో మం బు గు శు
« అక్టో    
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: