అర్థం చేసుకో బాలయ్యా

జీవితం ధార పోసి
సంపాదించిన పేరును
పేరాశ కోసం పణంగా పెట్టి
రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి
సచ్చిన ‘పామును’
అన్న కాలి గోటికి సరిపోడు అనడం
అంత బావుండదు

బెరుకు బెరుగ్గా వచ్చినా
పంచలు ఊడబెరకండి అని
నాలుక ఊడబెరుక్కొని మరీ చెప్పినా
ప్రజలు రాజకీయ చంటబ్బాయిని చేసారు

అందుకే బాలయ్య ని పసి బాలుడు అని చెప్పాడు
తనకు జరిగినట్టు జరగకూడదని

రాజు అవ్వాలని వచ్చి రాజ్యాన్ని చేతిలో పెట్టి
అమాత్య పదవికోసం అంగలార్చుతున్న
అందరి వాడు గురించి అందరూ తక్కువ అంచనా వేస్తున్నా
ఆ కథానాయకుడి అభిమాని ఆశ మాత్రం చావడం లేదు

ఎన్నో సినిమాల్లో కథానాయకుడు ఆవేశపడుతాడు
బలీయమైన ప్రతినాయకుడు కథానాయకుడికి
విరామం వరకు ఆటంకాలు సృష్టిస్తాడు
వికటాట్ట హాసం చేస్తాడు
తరువాత కథానాయకుడు ఇలా తనవల్లా కాని పని అని
ప్రతినాయకుడి దగ్గర పనివాడిగా చేరుతాడు
ఒక్కొక్కరిని నిర్మూలించుకొంటూ
అంతిమ విజయాన్ని సాధిస్తాడు
అచ్చు అలా మన కథానాయకుడు
ఇప్పుడు ప్రతినాయకుల పంచన చేరి
వారి బలీయమైన సాంప్రదాయ ఓటు బ్యాంకును దూరం చేస్తున్నాడు
రాబోయే రోజుల్లో తనకు ఎక్కువ ప్రాపకం సాధించి
మిగిలిన వర్గాలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకొనేలా చేసి
ప్రతినాయకుడి ‘చేతి’ లో ని కుర్చీని కూలదోస్తాడు
ఇలాంటి వ్యూహంలో సగం అంకం పూర్తిచేసిన
మన రాజకీయ కథానాయకుడి గురించి పూర్తిగా
అవగాహన లేకుండా ఇలా మాట్టాడ్డం బాలేదని
ఆయన అభిమాని అంతెత్తున మండిపడుతున్నారు.

ప్రకటనలు

3 Responses to “అర్థం చేసుకో బాలయ్యా”


  1. 1 అనామకం 2:15 సా. వద్ద జనవరి 24, 2012

    Good

    మెచ్చుకోండి

  2. 2 tarakam 4:09 సా. వద్ద జనవరి 24, 2012

    script is very good.let’s hope the movie will be MegaHit! & R.I.P. for Congress party in A.P.

    మెచ్చుకోండి

  3. 3 Aparichithudu 5:04 ఉద. వద్ద జనవరి 25, 2012

    nice

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • అందాల ప్రపంచం పారిస్ ప్రకృతి సేద్య ఆహారం అందాన్నే కాదు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఆంధ్రా ప్రకృతి వ్యవసాయ ప్… twitter.com/i/web/status/1… 1 hour ago

వీక్షణలు

  • 866,562

తడి ఆరని ఉతుకులు

జనవరి 2012
సో మం బు గు శు
« డిసెం   ఫిబ్ర »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: