సముద్ర తీరాలను
తీర్థ ‘ప్రసాదా’ల్లా ఎవరికైతే
ప్రసాదించారో
వారినే మరో తుమ్మి ని చేసి
అబ్బ సొత్తు లా అప్పగించిన ఆయన
తనయుడి కి ప్రతి సాక్ష్యంగా
దర్యాప్తు సంస్థ మర్చబోతోందని ఉప్పంది
ఉలిక్కి పడి
అరెస్టు అయితే వచ్చే
ఉద్రేకాల అంచనాలకు
ముందస్తు రెక్కీ నిన్న జరిపి
వచ్చిన ఫలితాలను చూసి
గొంతులో పచ్చి వెలక్కాయ పడగా
సాక్ష్యం లేకుండా చేయేస్తే
లక్షల చేతులు లేస్తాయని
ఆంబోతు రంకెలు వేయించారు
కమల దళాన్నే దడిపించే స్థాయికి వెళ్ళిన
సుడి గాలి నే ఓపికగా ఒడిసి పట్టి
మూడు చెరువుల నీళ్ళు తాపించిన
దర్యాప్తు సంస్థ పై
రంకెలు వేస్తున్నామని
రాజకీయ కొత్త బిక్షగాళ్ళు మరిచారు.
జరగాల్సిందే