అమాత్యుడు
అందులోనూ
అధికార పక్ష పార్టీకి అధ్యక్షుడు
అయిన గాంధీ భవన్ సారు
ఇంట్లో వాళ్లకి
ఇంటి పనోల్లకి
ముప్పై కి పైగా బ్రాందీ షాపులు
ఎట్టించుకొని
మద్యం ముడుపుల సమయంలో
ఎగేసుకొని సభకు పొతే
ఇరుక్కుపోతామని
అందులోనూ అయినవాల్లే అయినా
కాని వాళ్ళు తన జుట్టును
ప్రతిపక్షం చేతికి పట్టిస్తారని
పసి గట్టి
రోజూ సభ లాబీల్లో కాలు గాలిన పిల్లి లా
పచార్లు చేసి వెళ్లి పోయే వారు
కానీ సభలో మద్యం గబ్బు పోయి
వ్యవసాయోద్దరణ రణం మొదలయ్యే సరికి
లోపలురికాడు సత్తి బాబు
పార్టీ లోని వారు
ఎట్టకేలకు సారొచ్చారని
సంభరపడుతున్నారు.
0 స్పందనలు నుండి “సారొచ్చారు” కు