బరితెగించిన వారు
సుద్దులు చెవిన వేసుకొందురా
వినడానికే బద్ధకం అని
అనడం కూడా తప్పు
నిండా మునిగిగాక చలేమిటి అన్న చందాన
వినే సమయం కూడా
వృదా చేస్తున్నామనే భావనతో
బరితెగించిన ఏలికలు బాధపడుతూండవచ్చు
నిజ్జంగా విని వుంటే
పంట విరామం పెట్టిన
అన్నదాత కోపం ఏమిటో
ఏలికలు తెలుసుకొని
రాబోయే కాలంలో
తమను ఏలికలను చేసిన వాళ్లకు
గడ్డి తినే దౌర్భాగ్యం తప్పించే
ఆలోచనలు చేసే వారు
బడిత పూజ చేయాల్సిన పూజారులు
వారు పెట్టే ప్రసాదాలకు కక్కుర్తి పడినన్నాల్లూ
ఈ తంతు ఇంతే
ఒక వేళ మారితే అది ఓ వింతే
కానీ గడ్డి తినే తలరాత
ఈ తరానికే తప్పకపోతే అది వింత గాదు.
0 స్పందనలు నుండి “గడ్డి తినే తలరాత” కు