చేగు వీర
చించండి పంచ అని
ఇరు ప్రక్కలా
చెరో తమ్ముడు
వాద్య సహకారం అందిస్తుంటే
హరి దాసు
గంజి నుండి బెంజి వరకు కథ చెప్పాడు
మధ్య మధ్య లో సామాజిక న్యాయ
స్మరణాలతో పందిలంతా మోతెక్కించాడు
వస్తున్న చదివింపులను బావ సర్దబెట్టాడు
మంగళం వినకనే భక్తులు వెళ్ళిపోయారు
హరి దాసుకు అత్తోరు ఊరు వారు కూడా మొహం చాటేశారు
మంగళం పాడే వరకు చాప మీద నించో బెట్టిన
చాప యజమానులకు
చిటికలు, ధరించిన శాలువా ఇచ్చి
తను ఎప్పటికీ మీ వాడినే అని
వారిచేతే నేను సామాజిక న్యాయ స్మరణ చేయిస్తానని
వెళ్ళిపోతున్న వాళ్లకు అరిచి చెబుతూ
చేతిలో చేయేసి
గంజినుండి బెంజి వరకు అన్నీ చూసినా
చూడని కుర్చీ కోసం
చూపిస్తానన్న వారితో
సుదూర ప్రయాణం మొదలెట్టాడు.
good
excellent & mega post !
వస్తున్న చదివింపులను బావ సర్దబెట్టాడు,మంగళం వినకనే భక్తులు వెళ్ళిపోయారు ,
గంజినుండి బెంజి వరకు అన్నీ చూసినా
చూడని కుర్చీ కోసం
చూపిస్తానన్న వారితో
సుదూర ప్రయాణం మొదలెట్టాడు.
These lines so correct
very pity and shame on chiru
LOL
What a ‘Pun’ch!… Excellent