సమాచార సారదుల ఎంపిక ఫైలును
గవర్నర్ చే తిరుగు టపా గావించి
నల్లారి నడక నల్లేరు కాదని
నల్లారి అల్లరికి అడ్డుకట్ట వేసింది అధిష్టానం
ఉప ఎన్నికల వీరుల ఎంపిక చేసే
నల్లారి సమావేశానికి పోక
సత్తి తన సత్తా చూపించడానికి
హస్తిన ప్రయాణం పెట్టుకొని
హస్తిన చేరీ చేరకనే
ఎన్నికల సీట్ల సీల్డు కవరను
బాగ్యనగరం లో విప్పి
సత్తి నెత్తిన మొట్టింది అధిష్టానం
ఒకరంటే ఒకరికి పొసగని ఇద్దరికీ
ఒకే రోజు జరిగిన పరాభవానికి
ఎదుటోళ్ళను చూసి పళ్ళికిలించే
పని లేకుండా చేసింది అధిష్టానం
కవిత్వం వ్రాసే ముందు తెలుగు భాష మీద మరికొంచెం దృష్టి పెడితే బాగుంటుందని నా అభిప్రాయం.
ఏకవచనం Tooth = పన్ను
బహువచనం Teeth = పళ్ళు (మీరు పల్లు అని వ్రాసారు!)
పల్లికిలించే కాక పళ్ళికిలించే అని వ్రాయటం సరి యైన spelling.
dhanyavadhamulu. sari chesaanu choodandi.
LOL
సరిజేసినందుకు చాలా సంతోషం.
నా అసహనానికి నొచ్చుకోకుండా ఓరిమి వహించినందుకు మీకు నా కృతజ్ఞతలు.
మీ మనస్సుకు కష్టం కలిగిస్తే మన్నించ వలసినది.
Teliyanidhi Telusukovadam lo thappu emundhi. Anudhuloonu Amma Basha Telugu nu.
సత్తిబాబుకు
ఉత్తరకుమారుడికి
చెరో సుత్తి దెబ్బ
భళా!