హస్తిన అధినేత్రి పుట్టిన రోజు గా
ఇస్తున్నట్టు చెప్పిన కానుకను
లెంపలేసుకొంటూ తిరిగి తీసుకొన్నప్పటి నుండి
ఏమి చెప్పాలో పాలుబోని
ఆ ప్రాంతపు శని
రోడ్ల మీద వండి తినేట్టు చేసాడు
ఆ తరువాత ఆ రోడ్లనే బహిర్భూముల చేసాడు
అమాయకులను ఆత్మహత్యలకు పురికొల్పాడు
విద్యార్థులకు విద్య దూరం చేసాడు
ఉద్యోగుల పని మానిపించాడు
నిత్యం దొంగని చెప్పే వాళ్ళ చేత
డప్పు తయారు చేసి తన డప్పు వేసాడు
అధినేత్రి బహిరంగ బహుమతి కి బదులు
అందిన లోపాయికారి బహుమతికి ముచ్చటపడిన
శని ఎట్టకేలకు శాంతించాడు
ఇక్కడే శని శాపాలకు గురైన పార్టీలు
దొంగను పట్టేసే సరికి
రద్దె ముద్దంటూ
వేరు ప్రాంతం కోసం
యాగం అన్నాడు
వచ్చే శివరాత్రికి వేరన్నాడు
తరుముకొస్తున్న ఉప ఎన్నికలముందు
శని గాడు శలవిచ్చినట్టు జరిగి పోతుందని నమ్మాలి మరి
ఇలా ఇప్పటికి ఎన్ని గడువులో పండగలో
అయిపోయాయి మరి.
వినాయకుడు శనికి రేపు రా అని గోడమీద రాసినట్టు
మన రాష్ట్ర శని
అమాయకులకు గోడమీద ఆశల రాతలు రాసి
ఏమార్చడం ఎన్నికల కోసమే.
శని గాడంటే ముక్కు బండగా వుండి, నల్లగా వుంటుంది.. అతగాడేనా.. ఇంకా రాహువు, కేతువు కూడా వుండాలే..