కొడుకునో కూతురునో
అమ్మ కూచి అంటారు
అట్టని అనిపించుకొనే అమ్మ కూడా
ఆకతాయి పనులు చేసే బిడ్డలను గద్దిస్తుంది
కానీ ప్రజలకు సేవచేస్తానని వచ్చిన
ఓ అమ్మ
కొడుకు కూచి గా మారి
కొడుకు కోటలు చూసి మురిసి
ఉన్నఫళంగా వ్యాపారవేత్త అయిన కొడుకును
చూసి ఉప్పొంగి
మిడిమంతరపు సిరి ఎలా వచ్చిందో
తెలుసుకోలేనంత తెలివిని బయట పెట్టి
పెనిమిటి చేసిన అవినీతి మధనం పై
పెదవి విప్పని ఆమెకు
ఉన్నట్టుండి సమాజం లో ని
పత్రికల యజమానులు
ప్రతిపక్ష నాయకులు
సినిమా వాళ్ళు
వ్యాపారస్తులు
పెద్దవాళ్ళు ఎలా అయ్యారో అని
అనుమానం వచ్చిన కొడుకు కోసం
నివృత్తి జేసుకోడానికి
దర్యాప్తులు జరపమని కేసులు దాఖలు చేసి
భంగపడి
కొడుకు కూచిగా
ప్రధానులకు లేఖలు రాస్తూ
ఆశ గా ఎదురు చూస్తున్నారు
రేపో మాపో కొడుకు కారాగారం మెట్లెక్కితే
ఆ తల్లి ఎంత తల్లడిల్లుతుందో
super ….
excellent ….. baga rasaru