శాంతికి
కలిసి ఉండడానికి
సుఖ సంతోషాల కోసం చేసే
హోమాలు చూసారు
వేర్పాటు కోసం హోమం ఏమిటా
అని అనుకొంటున్నారా?
అడ్డంగా దొరికిపోయి
పోయిన పరువును
రాబట్టుకోడానికి కాకపోయినా
అమాయక భక్తులనాకర్షించడానికి
నిత్యానందులు చేసే హోమాల్లా
పోలవరం విషయం లో అడ్డంగా దొరికిపోయి
పోయిన పరువును
రాబట్టుకోడానికి కాకపోయినా
అమాయక ఓటర్లనాకట్టుకొనే
కనికట్టే ఈ వేర్పాటు కోసం హోమం.
హోమం వేర్పాటు కోసం కాదు. ఎన్నికలప్పుడు వేర్పాటు వాగ్ధానం చేసి రాత్రికి రాత్రే సమైక్యవాదులయిన మూర్ఖులకు జ్యానోదయం కోసం
మూర్ఖులతో కలిసి ఉండటం మూర్ఖత్వమే. కాదనేదెవరు. వీరతెలంగాణావాదులు తమతమ బిడ్డలకు తప్పకుండా నేర్పుతారు కాబోలు పొరబాటునకూడా కలిసిఉండకూడదు అది గొప్ప తప్పు అని.
ఎవరో కోర్టుకెళ్ళి పోలవరం టెండర్లని ప్రశ్నించడం వల్ల ఆ టెండర్ చేజారిపోయింది కేసీయార్ అండ్ రాజమ్ కంపెనీకి ! కేసీయార్ తో కుమ్మక్కయిన కాంగ్రెస్ ప్రభుత్వం తన పరువు కాపాడుకునే యత్నంలో భాగంగా వాటిని రద్దుచేయక తప్పలేదు, చేజాఱిపోయాక ఇప్పుడు “ఆహా ! చూశారా మా నిజాయితీ, తెలంగాణ పట్ల మా నిబద్ధత. ?” అని బుకాయిస్తున్నారు. అసలు పోలవరాన్ని వ్యతిరేకించేవాళ్ళు పోలవరం టెండర్లలో ఎందుకు పాల్గొన్నారనే ప్రశ్న శేషప్రశ్నగానే మిగిలిపోయింది. ఇంకా ఈ పనికిమాలినవాళ్ళు నిఖార్సైన తెలంగాణవాదులనీ,, వీళ్ళు ఏదోఒకరోజు తెలంగాణ తెస్తారని నమ్మే పిచ్చి…..న్నారు తెలంగాణలో !
శ్యామలరావు గారూ, ఆంధ్రులందరూ తమ పిల్లలకు “కలిసి ఉంటె కలదు సుఖం” అని నేర్పుస్తున్నారా?
“నాన్నా, మనమూ బాబాయి వాళ్ళు తాతయ్య తోటి కలసే ఉన్నామా?” అని బుడ్డాడు అడుగుతాడు. దానికి సమాధానం ఏ తండ్రి చెప్పగలడు?
“ఉమ్మడి” మదరాసు రాష్ట్రం నుండి వేర్పాటు ఆంధ్రుల అభిమతం ప్రకారం జరిగింది. అప్పుడు ఈ నీతివాక్యాలు, సుమతీ శతకాలు ఎవరూ వల్లవించలేదు.
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం వేరపాటయిన ఆంధ్రులతో బాటు తెలంగాణా వాళ్ళు కూడా వున్నారా లేదా…నైజాం పరిపాలన లో రజాకార్లు తన్ని తగిలేస్తే తెలాంగానా ప్రాంతం వాళ్ళని ఆదుకున్నది ఆంధ్రా వాళ్ళా కాదా.. ఇలా వేర్పాటు వాదంతో ఆంధ్రా వాళ్ళని తిడుతూ వుంతే ఎప్పటికీ తెలంగానా రాష్త్రం ఏర్పడదు..ఎప్పటికప్పుడు ఇలా బ్లాక్ మైల్ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకునే తెలాంగాణా ప్రాంత నాయకుల నైజం అందరికీ తెలిసిందే.. అసలు నిజంగా మోసపోయింది ఆంధ్రా లో వున్న ఎన్నో మారుమూల గ్రా మాల అమాయక ప్రజలే…రోగుల్లో కూడా ఆంధ్రా, తెలంగాణా అంటూ సెపరేట్ గా చూస్తున్న నాయకుల్ని ఏమనాలి..
గొట్టిముక్కలవారి ప్రశ్నలకు జవాబులు.
ఆంధ్రులు అన్నమాటలో తెలుగువారందరూ ఒదుగుతారని తమకు తెలియనిది కాదు.
ఉమ్మడికుటుంబ వ్యవస్థకు ప్రాతిపదికలు కులవృత్తులు. ఇక్కడ కులం అనేదానిని సంకుచితార్థంలో గ్రహించవద్దని మనవి. ఈ వంశానుగత (కుల)వృత్తులు కొనసాగించటానికి వీలులేని పరిస్థితులు యేర్పడటానికి కారణం వృత్తి కుటుంబస్థాయినుండి వ్యక్తిస్థాయకి దిగటమే. దానికి పారిశ్రామికీకరణం కారణం. యేతావాతా వృత్తిగత వ్యక్తిగత కారణాలవలన ప్రజలు ఉమ్మడికుటుంబాలను కొనసాగించలేని పరిస్థితిలో చిన్నచిన్నకుటుంబాల వ్యవస్థయేర్పడింది. ఇది కాలానుగుణపరిణామమేకాని యే విధమైన విద్వేషాలు ఆవేశకావేశాలవలన యేర్పడిన విషపరిణామంకాదు. అయితే అన్నదమ్ములు అప్పచెల్లెండ్రు విడివిడి కుటుంబాలుగా ఉన్నా మానసికంగా శత్రువుల్లా ఉన్నారని అర్థంకాదు – అటువంటి విషవ్యవస్థ యేమీ లేదు.
వృత్తి ఉద్యోగాల కారణంగా కలసి ఉండటం సంభవంకావటంలేదని పెద్దలు సులువుగా బోధపరచగలరు, పిల్లలు అంతే సులువుగా బోధపరచుకోగలదు. కాబట్టి వింతా లేదు చింతా లేదు ఇక్కడ.
ఉమ్మడి మదరాసు రాష్టం అనేది ఒక కిచిడీ. అరవలూ తెలుగువారూ కలసి ఉండటం రెండు కుటుంబాలు ఒకలోగిలిలో (అద్దెకు) ఉండటం వంటిది. ఏక కుటుంబ వ్యవహారం కాదు. ఇది ప్రత్యేకంగా వివరించాలని మీరు కోరుకుంటున్నారని నేననుకోను. (అంతా భారతీయులమే కదా యేక కుటుంబమే అని వాదిస్తారా? శుభం. కానివ్వండి. వద్దన్నదెవ్వరు? అప్పుడు వసుధైకకుటుంబం అనే మాట ఉన్నది కదా. ఇన్ని దేశాలుగా మాత్రం యెందుకని విడివిడిగా ఉండాలి? అదికూడా మీరు ఆలోచిస్తే సమాధానం సులభంగానే దొరుకుతుంది మీ ప్రశ్నకి.) మీరు నీతివాక్యాలని సుమతీశతకాన్ని యెద్దేవా చేయనవసరంలేదు. కనీసం, మీరనే సీమాంధ్రప్రాంతలో వాటికి యింకా బాగానే విలువ ఉన్నది అనుకుంటున్నాను. తెలుగువారు అరవల జులుంనుండి సంరక్షించుకుందుకు విడిపోవటం మీరనుకున్నట్లు కూటనీతి కాదు. తెలుగువారే అంతఃకలహంతో నలుగురిలో నవ్వులపాలుకావటం కొందరి కూటనీతి కావచ్చును గాని .
వేర్వేరు
పిశాచులు ఏకాదశి వ్రతం చేసినట్టు వీడు ఫూటుగా తాగి యాగం చేయబట్టే ఆగమవుతోంది. ఇలాంటి వాళ్ళ వెంట గొట్టామ్ముక్కు లాంటి వారి చెక్క భజనలు.
శ్యామలరావు గారూ, ఆంధ్రులు అనే పదానికి తెలుగు వారు అనే తాత్పర్యం ఇప్పుడు లేదనుకుంటా.
ఇక పొతే ఉమ్మడి కుటుంబాల గురించి మీరు చెప్పిన దానికే తెలంగాణాను అన్వయించి చూడండి. ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరుగా ఉన్నందున ఎలా తప్పు కాదో, రెండు రాష్ట్రాలున్నా తప్పు కాదు.
సామరస్యంగా విడిపోదామని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. డిసెంబర్ 10 ఘటనల తరువాత అంతఃకలహాలు పెరగడం చాలా దురదృష్టం. అప్పడిదాకా తెలంగాణా రాష్ట్రాన్ని సమర్థించిన తెదేపా ప్రరాపాలు మాట మార్చి తమ డొల్లతనాన్ని చాటుకోవడం ఒక మచ్చగా మిగిలిపోతుంది.
@Voleti Shankar:
Q: తెలంగాణా సాయుధ పోరాటంలో ఆంధ్రులందరూ పాల్గొన్నారా?
A: కేవలం కమ్యూనిస్టులు మాత్రమె, అది కూడా దేశమంతటినించి, ఆంధ్రా కమ్యూనిస్టులు “కూడా” పాల్గొన్నారు.
ఆంధ్రావాళ్ళు కాక దేశమంతటినుంచీ పాల్గొన్న ఆ కమ్యూనిస్టులెవఱూ ? నాలుగుపేర్లు చెప్పండి చేతనయితే ?
ఆ కాలంలో ఆంధ్రా కాక ఏ రాష్టంలో కమ్యూనిస్టుపార్టీ బలంగా ఉంది ?
గొట్టిముక్కలవారూ
ఆంధ్రులు అనే పదానికి తెలుగు వారు అనే తాత్పర్యం యెప్పుడూ ఉంటుంది మారదు.
రాజకీయులు తదనుయాయులు తద్వాలతుల్యులు కొందరు వద్దనుకున్నంత మాత్రాన మాటల యొక్క అర్థాలు మారిపోవు.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి నేను చెప్పిన దానికి ప్రత్యేక తెలుంగాణా వాదనను అన్వయించటానికి సరయిన ప్రాతిపదిక లేదు. నేను చెప్పిన వివరణలు మీరు సరిగా అన్వయించుకుని చూస్తే మీకే అర్థం అవుతుంది. ఆవేశకావేషాలకారణంగా కాదు అని నేను స్పష్టంగానే వివరించానే!
మీరన్నట్లు “ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరుగా ఉన్నందున ఎలా తప్పు కాదో” విషయం చూద్దాం. ఆ వేర్వేరుగా ఉండటం కక్షలు, కార్పణ్యాలు, చెప్పుడుమాటలు, అభాండాల వగైరా కారణాలవల్లనైతే ఖచ్చితంగా వేరేవిషయం. అవి వారిలో ఒకరు యెగదోసి అందుచేత విడిపోదాం అనటం దారుణం కాదా?
రెండు రాష్ట్రాలున్నా తప్పు కాదన్నారు. మంచిది. అటువంటపుడు రెండు కాస్తా ముందుముందు నాలుగో పద్నాలుగో అయినా తప్పుండదు కదా? అటువంటిది వాంఛనీయమా? ఇప్పుడు సరైన ప్రాతిపదిక లేకుండా పనిపాటులేని వాళ్ళ స్వార్థంకోసం ఒకటిని రెండుగా చేస్తే, ముందుముందు యీ విభజనను ఆధారం చేసుకొని మరిన్ని ముక్కలు చెక్కలు చేయాలని కోరే వాళ్ళు, వాళ్ళకు జై కొట్టి గుడ్డిగా వంతమాడే మేధావులు, వాళ్ళను అమాయకంగా వెంబడించే సామాన్యులు బోలెడు మంది తయారు కారా? ఇలాగే ప్రతి చిలిపి కారణానికీ అక్కడక్కడా దేశంలో రాష్ట్రవిభజనల కోరికలు ఉరకలెత్తితే దేశ సమగ్రత చిక్కుల్లో పడదా? అంతెందుకు, తీరా యీ తెలంగాణా రాష్ట్రం వస్తే కొన్నాళ్ళకు హైదరాబాదు విడిగా వేరే రాష్ట్రం కావాలని అడిగితే వద్దనటానికి యీ వీరతెలంగాణా వాదులు సిధ్ధంగా ఉన్నారా / ఉంటారా చెప్పండి. ఆవేశాలు కాదు ఆలోచన ముఖ్యం. ఆందోళనకాదు వివేకం ముఖ్యం.
@హైదరాబాదీ:
BT Ranadive, SA Dange etc. actively participated in the rebellion. Can you name a single non-Communist Andhraite in the rebellion?
@తాడిగడప శ్యామలరావు:
మీరు చెప్పిన కారణాలన్నీ కొత్తవి కావు. అయినా చంద్రబాబు, చిరంజీవిలు 2009 ఎన్నికలప్పుడు తెలంగాణా విభజన సమర్తించారు. చంద్రబాబు వీరవిదేయులు చాకిరేవు గారు అప్పుడు ఈ నిర్ణయాన్ని ఎదిరించలేదు.
ఎన్ని రాష్ట్రాలున్నా తప్పు లేదు. ఒక వేళ హైదరాబాదీలు లేదా ఇతరులు రాబోయే తెలంగాణా రాష్ట్రం నుండి విడిపోదామని కోరుకుంటే దాన్ని బలవంతంగా ఆపడం దారుణం. బలవంతపు సహచర్యం ఎప్పుడూ సఫలం కాదు.
మీరు “ఆవేశాలు కాదు ఆలోచన ముఖ్యం” అన్నారు. డిసెంబర్ 10 ఘటనలు ఆవేశానికి తార్కాణం కానీ ఆలోచనకు నిదర్శనం కాదు.
“తెలుగువారు అరవల జులుంనుండి సంరక్షించుకుందుకు విడిపోవటం మీరనుకున్నట్లు కూటనీతి కాదు.”
తమిళులు (అరవలు అనే పదం మర్యాద కాదేమో) చేసిన జులుం ఏమిటే విని తరించగలను.
తెలంగాణా వారికి భాష పరమయిన సంకుచిత్వం లేదు. మాకు అన్ని భాషలు సమానమే. భాష పేరుతొ ఇతరులను ఆడిపోసుకోవడం పాడి కాదు.
తెలంగాణా నాయకులు అందరూ అన్నదమ్ములగా విడిపోదాం అంటున్నారు, ఇంతకి ఇందులో అన్న ఎవడు, తమ్ముడు ఎవడు. పంచుకోవడానికి ఆస్తులు ఎవడబ్బ సొమ్ము.
పొద్దున్న లేచి, ఫుల్ గా తాగి, సీమాంధ్ర ప్రజల మీద బూతు పురాణం తో విరుచుకుపడే నేతని తెలంగాణా ప్రజలు తమ నాయకుడిగా సహించినంత కాలం, సామరస్యంగా విదిపోతున్నమనే బ్రమలో ఆంధ్ర ప్రజలు వుండరు.
2009 ఎన్నికలప్పుడు చంద్రబాబు తెలంగాణాకు అనుకూలమని చెప్పారు అని అంటున్నారు గాని, తెలంగాణా ప్రజలు దానిని నమ్మలేదని అనుకోవడానికి ఆ ఎన్నికల ఫలితాలే నిదర్సనం.
రెండు సార్లు గెలిపించిన కాంగ్రెస్ హామీలకు ఎసరు పెట్టినా, తెలుగు దేశం పై అనవసర అబాండాలు వేసే నాయకులు ఉన్నంత కాలం, తెలంగాణా రానే రాదు.
తెలంగాణా ఇస్తే సీమాంధ్ర లో ఫినిష్ అయిపోతమనే బయంతో కాంగ్రెస్ వెనకడుగు వేస్తున్నదనే నిజం తెలంగాణా ప్రజలకు అర్ధం అయింది అనుకోవాలా, లేక మీకు ఆ మాత్రం తెలివి లేదనుకోవాల.
సామరస్యంగా విడిపోవాలి అనుకుంటే వచ్చే ఎన్నికలలో తెలంగాణా రాష్ట్ర సమితి వారు అన్ని స్థానాలలో పోటి చేసి అధికారం లోకి వచ్చి, అసెంబ్లీ లో తీర్మానం చేసి సెంటర్ కి పంపించి విడగొట్టండి.
సామరస్యంగా విడిపోవాలి అంటే, సీమాంధ్ర ప్రజలని ఆ వేరు కుంపటి కి ఒప్పించడం మీ బాద్యత. ఒప్పించి, మెప్పించి, గెలిచి విదిపొండి. నిందలు మాని, మీ బాద్యత ఎరిగి పని మొదలెట్టండి.
విజయీ భవ!
గొట్టిముక్కలవారూ
రాజకీయవ్యవహారాలపై నేను వ్యాఖ్యానించటం లేదు.
ఎన్ని రాష్ట్రాలున్నా తప్పు లేదన్నారు. అది సరైన దృక్పధంకాదేమోనని నా భావన. స్వాతంత్ర్యంవచ్చేనాటికి వందలాదిగా ఉన్న సంస్థానాలను విలీనంచేసిన ప్రయోజనాన్ని మనం విఫలం చేయరాదేమో యోచించండి. మీరన్నట్లు అడిగినవారికల్లా ప్రత్యేకరాష్ట్రం యిస్తూపోతే ఒక నాటికి కొన్ని వందల రాష్ట్రాలు యేర్పడితే మనకు మంచిదా? ముఖ్యమంత్రులసభ సరిపోతుంది పార్లమెంటు అనే వ్యవస్థ యెందుకు అనే పరిస్థితి వస్తుంది కదా? ఇప్పుడున్న కొన్ని రాష్ట్రాలమధ్య గొడవలతోనే యెన్ని చీకాకులు. రెండువందలో మరికొన్ని వందలో రాష్ట్రాలు యేర్పాటు చేసుకుంటే హాయిగా నిత్యం అన్నిరాష్ట్రాలు పరస్పరకలహాలతో దివ్యంగా వర్థిల్లి చివరకు పరాయిపాలనకు దారితీస్తుందని గ్రహించగలరని ఆశిస్తున్నాను.
అరవలు అనే పదం మర్యాద కాదేమో అన్నారు. ఒకప్పుడు శ్రీమతి మాలతీచందూరుగారూ ఈ మాటే అన్నారు. నిజమే కావచ్చు. కాని అరవం అనే మాటను ఇప్టటికీ ప్రయోగిస్తూనే ఉన్నారు. పెద్దగా అభ్యంతరం కనపడలేదు నాకు. అది భాషకు పేరే కాని తిట్టు పదం కాదు గదా.
భాష పేరుతొ ఇతరులను ఆడిపోసుకోవడం పాడి కాదని అందరూ ఒప్పుకుంటారు. నేను అలా ఆడిపోసుకున్నానని మీరెందుకు అనుకుంటున్నారో బోధపడటంలేదు. అందరి సంగతీ నేను వకాల్తా పుచ్చుకొని చెప్పను గాని నాకు కూడా భాషాపరమైనసంకుచితత్వం లేదనే అనుకుంటున్నాను. అయితే తెలుగును నా మాతృభాషగాబట్టి అభిమానిస్తాను. సాటి తెలుగువారు తెలుగును తెలుగులా చక్కగా మాట్లాడితే విని ఆనందించాలని కోరుకుంటాను. చాలా కాలం క్రిందట ఒక కాంటీను సప్లయరు “పెరుగు అంటావేంది? దై అని తెలుగులో చెబితే తెలిసేదిగదా” అని నన్ను కోప్పడ్డాడు. ఈరోజున తెలుగుమాటలు వేగంగా మాయమై పోతున్నాయి “పాట” అనే మాట యెగిరపోయి అంతా ‘సాంగు’ అంటున్నారు. నాకైతే అభ్యంతరంగానూ అసహనంగానూ ఉంది. మీరు దానిని భాషాపరమైన సంకుచితత్వం అనుకుంటారో లేదో నాకు తెలియదు.
@తాడిగడప శ్యామలరావు:
ఒకప్పటి సంస్థానాలు బలం ఆధారంగానో, బ్రిటిష్ రాజుల దయపైనో ఆధార పది ఏర్పడ్డాయి. ఈరోజు రాష్ట్రాలు ప్రజాస్వామ్య పద్దతిలో జనాభీష్టం మేరకు ఏర్పడ్డాయి. ఈ రెండిటిని పోల్చడం సబబు కాదేమో.
ప్రజాస్వామ్యంలో ప్రజల కోరికను మన్నించకపోవడం ఎంత వరకు సమంజసం? తమకంటూ ఒక రాష్ట్రం ఏర్పడాలని కోరుకునే హక్కు అందరికీ ఉంది. దాన్ని దేశ ప్రయోజనాలకి ముప్పని ముద్ర వేయడం ఆత్మా వంచన తప్ప వేరేది కాదు.
ఎన్ని వందల రాష్ట్రాలు అవుతాయో, వాటికి ఎన్ని సమస్యలు వస్తాయో అనేది కేవలం ఒక ఊహాగానం. ఎప్పుడో వస్తుందో రాదో తెలియని, వచ్చినా ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియని విషయాన్ని magnify చేసి ఈ నాడు మన కాళ్ళ ఎదురుగా జరుగుతున్న వాస్తవాన్ని గుర్తించకపోవడం కొరివితో తల గోక్కేవడమే.
తమిళ భాష పర్యాయ పదాల మాట అటుంచి, వారు ఆంధ్రుల పై చేసిన జులుం ఏమిటో మీరు వివరించలేదు.
ప్రతి ఎన్నికకీ ప్రజలు తమ ఏలికల్ని మార్చడంలో తప్పులేదు. అలాగే రాజకీయపార్టీలు పరిస్థితుల్ని తమ పాలసీల్ని మార్చుకోవడంలోనూ తప్పులేదు. అదేమీ మోసమూ కాదు, వంచనా కాదు. ప్రజాస్వామ్యమంటే కరుడుగట్టిన విధానాలు కాదు. కనుక మొదట ప్రత్యేక తెలంగాణకి మద్దతు ప్రకటించినవారు తరువాత దాన్ని ఉపసంహరించడంలో తప్పులేదు. గతంలో ప్రత్యేక ద్రవిడస్థాన్ కావాలని 30 ఏళ్ళపాటు పట్టుపట్టిన డి.ఎమ్.కె. ఆ తరువాత ఆ పాలసీని విడిచిపెట్టింది కదా !
పై వ్యాఖ్యలో “ఆత్మా వంచన” బదులు “ఆత్మ వంచన” గానూ, అలాగే “కాళ్ళ ఎదురుగా” బదులు “కళ్ళ ఎదురుగా” అని చదువుకోగలరు. అచ్చుతప్పులకు క్షమించండి.
చర్చ సుదీర్ఘమౌతున్నట్లు నాకనిపిస్తున్నది.
దేశంలో రాష్ట్రాలు యేవిధంగా యేర్పడ్డాయి గతంలో అన్నది ప్రశ్నగాదు.
జనాభీష్టం వంకతో రాష్ట్రాలసంఖ్యను పెంచుకుంటూపోవటం మరింత గందరగోళపరిస్థితికి దారితీస్తుందంటే మీరు ఊహాగానం అంటున్నారు. నేను కీడెంచి మేలెంచటం అంటున్నాను. ప్రజాస్వామ్యంపేరుతో ‘విధిని’ ఆడించాలను చూస్తే లాభం ఉండదని గ్రహించాలి. భవిష్యద్దర్శనం ఇష్టంలేక పోతే మంచిచెడ్డలు జరుగకుండా పోవు. కొరివితో తల గోకు కోవటం అంటే సరైన దృక్పధం లేకుండా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవటమే.
తమిళాంధ్రభాగవతాలగురించి ఆంధ్రభూమి ఎడిటర్ శాస్త్రిగారి పుస్తకాలలో చాలా వివరంగా చదవుకోవచ్చును. ఇది క్లుప్తచర్చకు కుదరదు. స్వస్తి.