స్వహస్తాలతో
కొడుకు పెరటి కంపెనీలకు పెట్టుబడిగా
ప్రజాస్వామ్యాన్నే పణంగా పెట్టించి
తను ఇడుపలేసుడైనాడు
సావాసులు ఒక్కొక్కరు చెరసాల పాలు అవుతుంటే
అధికార వాసంలో అడ్డుచెప్పని అధికారులు
విచారణకు విచారపడుతూ
ఒడ్డున పడని పెద్దచేపల మాటేమిటి
మాకోసం మాటువేసి
ప్రజలలో మమ్మల్ని మాత్రమే మాటపడేట్టు
చేస్తున్నారని మధనపడుతున్నారు
కొడుకు కట్టుకొన్న కోటలకు
వేసుకొన్న మేటలకు
ప్రజాస్వామ్యాన్ని కాపలాగా పెట్టాలని
కాళ్లరిగేలా తిరుగుతున్నాడు
కోటల కుమారుడి దాస దాసీలు మాత్రం
హస్తిన యొక్క హస్తం
ప్రతిపక్షాల సాక్షిగా
కుట్ర చేస్తోందని మాత్రం
చెప్పిందే చెబుతూ
ఆర్థికంగా అంబానీలు ఎలా అయ్యారో మాత్రం చెప్పలేక
కట్టిన కోటల్లోకి కాక
చెరసాలలోకి ఏ క్షణాన
తమ నాయకుడు
వెళతాడో అని వెర్రెక్కి పోతున్నారు
0 స్పందనలు నుండి “ఏ క్షణాన” కు