అయ్య కొడుక్కోసం చేస్తున్న
దోపిడీ గురించి
సభ దద్దరిల్లినన్ని రోజులూ
ఎదురు దాడి దాండియాతో
ఎగతాళి పాట పాడారు
సభాపతికి
ప్రధాన మంత్రికి
జాతీయ ప్రతిపక్షాలకు
దేశ అధ్యక్షులకు
ఈ తంతు గురించి వినతులిచ్చినా
పాపం పండలేదు గనుక
పట్టించుకోలేదు ఎవరూ
అడపా దడపా
కాలాక్షేపపు కమిటీలు వేసి
“చట్టం తన పని చేసుకు పోతుంది”
అని అయ్య ఓ పాట పాడేవారు
కొడుకుపై వచ్చిన హత్యారోపణలో కూడా
అత్యున్నత దర్యాప్తు కోరి
“చట్టం తన పని చేసుకు పోతుంది”
అని అయ్య అదే పాట పాడారు
అప్పుడుకూడా
‘తాత’ల కాలం నాటి ఫ్యాక్షన్ న్యాయంతో
నచ్చని వాడి ని “కాల్చి చంపేయడం “
అమలుచెయ్యమని
ఆవేదనతో నూ అడగలేదు
ఆనందంతోనూ అడగలేదు
పైగా ఆ దర్యాప్తు తీర్పును
డప్పుకొట్టి చెప్పి
నిజాయితీని చాటుకొన్నారు
శంకరిగిరి మాన్యాలు పట్టిపోయిన
అమాత్యుడి దయతో చట్టం శాసిస్తే
ఇన్నాళ్ళకు మళ్ళీ
అయ్య నిత్యం ఆలపించే
“చట్టం తన పని చేసుకు పోతుంది” పాటకు
ప్రజలు పరవశిస్తున్నారు
కొడుకు వినలేక
‘తాత’ల కాలం నాటి ఫ్యాక్షన్ న్యాయంతో
నచ్చని వాడి ని “కాల్చి చంపేయడం “
అమలుచెయ్యమని
ఆవేదనతో అడగడం చూస్తుంటే
‘గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది’ అనే సామెతను
బాగా నమ్మి
సానుభూతితో మరో సారి
ప్రజాస్వామ్య సవారీ చేసి
సంపాదించినది భద్రం చేద్దామని చూస్తున్నట్టు వుంది.
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు