తొమ్మిదేళ్ళు ఏలిన బాబు
తోటి రాజకీయ నాయకుడిని
తనతో పోల్చడం చూసి
అడవి పంది ఆవేదన
రైతు పొలంలో పంట వేయకముందు
పొలం చుట్టూ పాదయాత్రలు చేసి
రైతుకు పండగ చేస్తానని చెప్పానా?
పంటకు ఉచిత ఇందిరా/రాజీవ్ కాపలా అనే
పధకం ఏమన్నా చెప్పానా?
చుట్టు ప్రక్కల పొలాల గట్లు తెంపి
నీటి యజ్ఞం చేస్తాననే హామీ ఇచ్చానా?
వరుణుడు వర్షం కురిపిస్తే
అడవి పందిగా గుర్రు గుర్రు మన్నానే గాని
వరుణదేవుడు నా పార్టీ అని పొలం చుట్టూ తిరిగి డప్పు గొట్టానా?
రైతు అదృష్టం బావుండి పంట పండితే
నేనే దేవుడి నని మిడిసి పడ్డానా?
తాతల కాలం నుండి తినడానికి దోచి
అడవులలో దాచినవి ఏమీ లేక
పంటల మీద పడి తింటాము
విందు బాగా అయ్యిందనీ ఆనందంతో
పండగ చేసే సమయంలో పంట నష్టం జరుగుతాది
మేము నిరక్షరాస్యులం మీకు మళ్లే
డాక్టరు గిరీలు చదువుకొని
మా పిల్లలకు దోచి ఇవ్వడం తెలీదు.
కనీసం ఇలా చెప్పుకోడానికి కూడా
మాకు మీడియా లేదు గుర్ గుర్…..
daani guringhi inkoka adavi pandi yenduku badha padutunnadi
chandra babu hayamulo vandhala kotlu nokkinapudu, ys and son vela kotlu side chesinapudu, thelangana peru cheppi kcr and co. kontha chillara motham jebulo vesukontunnapudu,, chivaraku votarlu chillara dabbulaki, saara packetlaki, biryani potlalaki ammudu pothe thappu lenapudu mana andharivadu chiranjeevi kevalam chinna packagelaki ammudupovadam pedha thappu kaadanipisthundhi………mana prajaaswamyaniki dhoka ledhanipisthondhi…..
అయ్యో అడవి పంది కెంత కష్టం వచ్చింది.దాన్ని ఓదార్చడానికొక చిన్న పందిని ఓదార్పుయాత్రకు పంపుదామా?