జీవితం ధార పోసి
సంపాదించిన పేరును
పేరాశ కోసం పణంగా పెట్టి
రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి
సచ్చిన ‘పామును’
అన్న కాలి గోటికి సరిపోడు అనడం
అంత బావుండదు
బెరుకు బెరుగ్గా వచ్చినా
పంచలు ఊడబెరకండి అని
నాలుక ఊడబెరుక్కొని మరీ చెప్పినా
ప్రజలు రాజకీయ చంటబ్బాయిని చేసారు
అందుకే బాలయ్య ని పసి బాలుడు అని చెప్పాడు
తనకు జరిగినట్టు జరగకూడదని
రాజు అవ్వాలని వచ్చి రాజ్యాన్ని చేతిలో పెట్టి
అమాత్య పదవికోసం అంగలార్చుతున్న
అందరి వాడు గురించి అందరూ తక్కువ అంచనా వేస్తున్నా
ఆ కథానాయకుడి అభిమాని ఆశ మాత్రం చావడం లేదు
ఎన్నో సినిమాల్లో కథానాయకుడు ఆవేశపడుతాడు
బలీయమైన ప్రతినాయకుడు కథానాయకుడికి
విరామం వరకు ఆటంకాలు సృష్టిస్తాడు
వికటాట్ట హాసం చేస్తాడు
తరువాత కథానాయకుడు ఇలా తనవల్లా కాని పని అని
ప్రతినాయకుడి దగ్గర పనివాడిగా చేరుతాడు
ఒక్కొక్కరిని నిర్మూలించుకొంటూ
అంతిమ విజయాన్ని సాధిస్తాడు
అచ్చు అలా మన కథానాయకుడు
ఇప్పుడు ప్రతినాయకుల పంచన చేరి
వారి బలీయమైన సాంప్రదాయ ఓటు బ్యాంకును దూరం చేస్తున్నాడు
రాబోయే రోజుల్లో తనకు ఎక్కువ ప్రాపకం సాధించి
మిగిలిన వర్గాలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకొనేలా చేసి
ప్రతినాయకుడి ‘చేతి’ లో ని కుర్చీని కూలదోస్తాడు
ఇలాంటి వ్యూహంలో సగం అంకం పూర్తిచేసిన
మన రాజకీయ కథానాయకుడి గురించి పూర్తిగా
అవగాహన లేకుండా ఇలా మాట్టాడ్డం బాలేదని
ఆయన అభిమాని అంతెత్తున మండిపడుతున్నారు.
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు