పార్టీ పెట్టక ముందు
“యువత రాజకీయాల్లోకి రావాలని “
కలాం చెప్పాడు అందుకే వచ్చాను అని
తనను యువత గా చెప్పుకొన్న ఆయన
తన సమకాలీకుడిని
చిన్న పిల్లోడి మనస్తత్వం
అనడంలోనే రాజకీయాల్లో ఎంత
తలపండిందో అర్థం అవుతోంది.
రాష్ట్రానికి చెందిన నటి, ఓ క్రికెట్ క్రీడాకారుడు
తమ సత్తా చాటిన ఊర్లో
ఉత్తర కుమారుడిగా మరో సారి ప్రయత్నిస్తున్న
అధినేత్రి తనయుడికి తోడుగా
ఆకర్షణ, తలపండిన, సామాజిక న్యాయ చిహ్నం
అయిన చిరజీవి గారు వెళ్లి ఓట్లు అడిగితే
ఏనుగంత బలమేమో అని ఒకరు కూడా అనుకోక పోవడం
అందరివాడిని చిన్నబుచ్చడం అవుతుందేమో మరి.
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు