జనవరి 17th, 2012ను భద్రపఱచు

గర్వభంగం

అయోధ్య లోని అంతః పుర
అందాల గురించి
పురాణాల్లో విన్నప్పటి కంటే
ఇంకా అందంగా గంభీరంగా
మన ముందుంచినప్పుడు

పురాణాలు చదివినప్పుడు విన్నప్పుడు
కనపడని రాముని కరుణ కళ్ళముందు కనిపించినప్పుడు

పెనిమిటి దూరం పెట్టినా
పిల్లలను పెంచిన విధం చూసినప్పుడు

అంతకు మించి
పద్యాలు గ్రాంధికము లేకుండా
తేట తెలుగులో
అద్భుత దృశ్య శ్రావణ కావ్యంగా
మనముందు బాపు గారు
నిలబెట్టిన విధం చూసి
నిలువెల్లా పులకించాం
ఈ రోజుల్లో ఏ భాష లో ని ప్రజలకూ
ఇలాంటి దృశ్య కావ్యం దక్కనందుకూ
మనకే దక్కినందుకూ
తెలుగు వాళ్ళుగా పుట్టినందుకు గర్వపడ్డాం

ఇంకా ఆ భ్రమల్లో ఉన్నంగానే
మనతో వ్యాపారమే లక్ష్యంగా
ఎన్నడూ వినని భూతులతో
అత్యధిక బీప్ శబ్దాలతో
మన తెలుగు వాళ్ళే
ఓ సినిమాతో సాంస్కృతిక దాడి చేసి
కళం కనిపెట్టాక ఇలాంటి సంభాషణలు
రాయబడలేదని పొగుడుతున్న
దర్శక బాషా రాయభారుల పొగడ్తలు
వచ్చిన వసూళ్లతో పొంగిపోతున్న వ్యాపారులు
వ్యాపారస్తులు అని చెప్పుకోవాలి
మేము కళామ తల్లి బిడ్డలం
అగ్ర నటులం అని చెప్పుకొనే అర్హత లేదు
సినిమా అనేది వ్యాపారం తో ముడిపడి వుండ వచ్చు
కానీ బాష కనుమరుగవుతూ
విలువలే తప్పటడుగులు వేస్తున్న సమాజాన్ని
కొంతైనా ప్రభావితం చేసే సినిమాని
తీస్తున్నామనే సృహ లో వుండాలి
లేని నాడు లేని అగ్రత్వం ఆపాదించుకొన్నా
హాస్యానికి అసహ్యానికి కథా వస్తువులవుతారు
కథానాయకులు దర్శకులు కాబోరు.


Twitter Updates

వీక్షణలు

  • 238,151

 

జనవరి 2012
సో మం బు గు శు
« డిసెం   Feb »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి


Follow

Get every new post delivered to your Inbox.