నాన్న వెలగబెట్టినప్పుడు
వరుణుడు కూడా మా పార్టీనే అని
ప్రచారం చేసుకొనే లా వర్షాలు పడినా
మునుపు తొమ్మిది గంటలు ఇస్తున్న కరెంటును
ఏడు గంటలు ఉచితంగా అని చెప్పి
ఇచ్చే మూడు నాలుగు గంటల కరెంటును
దోబూచుల ఆట చేసి
రైతులను రేయంతా ఏడిపిస్తూ
మొట్ట మొదట వ్యవసాయానికి నాన్న లాలి పాట మొదలెట్టాడు
పండే భూములు పరిశ్రమలు ఇవ్వమని చెప్పి నిరసించిన జనాలను
కాల్పించి ఉద్యమాలకు నాన్న లాలిపాట పాడారు
గిట్టు బాటు ధరలు కల్పించమని చెప్పిన ప్రతిపక్షాలకు
నాన్న ఎదురు దాడి లాలిపాటలు మొదలెట్టారు
ప్రధాని దగ్గరికి ప్రతిపక్షం రైతుసమస్యలపై వెళితే కలవనివ్వకుండా చేసింది లాలిపాటగాడే
వ్యవసాయం దండగ అని బాబు అన్నాడనే లాలిపాటను
శాశ్వత నిద్ర వచ్చే వరకు పాడుకొనింది నాన్నగారే
అప్పటికే రాష్ట్ర కేంద్ర పాలకులకు గాఢ నిద్ర వచ్చింది
నాన్న పాడిన లాలిపాటకు గాఢ నిద్రలోకి జారుకొన్న రాష్ట్ర కేంద్ర పాలకులకు
కొడుకు గారు కొత్తగా
మేలుకొల్పు పాటను వినిపిస్తానని చెప్పడం
మడమ తిప్పని మాటకు అపచారం చేసినట్టు అవుతుందేమో ఆలోచించండి
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు