ఉద్యమం అమ్మేసింది నిజం కాదా?
చర్చకు రండి నిరూపిస్తా అని అనడమే కాకుండా
ప్రాణాలు పోగుట్టుకొన్న వారి కుటుంబ సభ్యులను పోగేసి
బలిదానాలు ముమ్మాటికీ ఉద్రేక పరిచిన వారి పొరపాటే అని
బిక్షమెత్తుకొని అయినా వారిని ఆదుకొందాం అని
అమ్మకం దారుల సంపాదన సవివరంగా చెబుతూ
ఆవేశపడుతున్న దళిత ప్రతిపక్ష ప్రజా ప్రతినిధి పై
చర్చకు సిద్ద పడక దొరల తరహా దాడులతో
నోరు ముయ్యించాలని ప్రయత్నిచడం చూస్తుంటే
ఇంకా ఆ ప్రాంతంలో దొరల సంస్కృతి
అలాగే ఉందని అనిపిస్తోంది
ఉద్యమ అమ్మకం నిజమే అని అనిపిస్తోంది.
దొఱల సంస్కృతి దొఱల సంస్కృతియే! ఎందుకు చస్తుంది? ఆవసరమైతే వేషాలు మార్చుకుంటుంది. నమ్మే- కొలిచే జనం ఉన్నంతకాలం , అన్ని రకాల దోపిడీ సంస్కృతులూ పదిలంగానే ఉంటాయి!
పొలిట్బ్యూరోలో తీర్మానాలు గాలికి వదిలేసి
మానిఫెస్టోలో వాగ్దానాలు యాదు మరిసి
రాత్రికి రాత్రి మాట మార్చి
గడ్డం దొర దగ్గరోల్లు
వాళ్ళ ప్రాంతానికే పట్టం కట్టి
తమ కులపోళ్ళకే ముద్దులు ఇచ్చి
మనసుల కుళ్ళు బయిట పెట్టినప్పుడు
యాడ బోయినవ్ నరసన్న?