మరో ఆంధ్రా అన్న

బ్లడ్ బ్యాంకు పెట్టి బడాయి పోయి
మెగా స్టారు కాబట్టి మరో ఆంధ్రా అన్నను చేస్తారని ఆశ పడి
మేక పోతూ గాంభీర్యంతో వచ్చినా
సేవా బిరుదులూ అభిమానులు ఇస్తే
మేమెందుకు ఆ అర్హతల చూసి అందలం ఎక్కించాలని
ప్రజలు ఇచ్చిన కొద్దిపాటి పాలక వ్యతిరేక తీర్పును కూడా
ప్రజా సేవ అంటూ హస్తిన అధినేత్రి పాదాల చెంత పెట్టి
పదవులకోసం ప్రదక్షిణాలు చేసి
ఊది కూడా దొరక్క ఊసురోమనే వేళ
ప్రతిపక్ష అవిశ్వాసం ఇచ్చిన ఉత్సాహంతో
అలక పాన్పు సీనులతో రక్తి కట్టించి
వీధి ఇస్తరయిన అధికారం కోసం
తనూ పావవుతూ ఎగబడుతూ వున్న
చిరంజీవికి సాటి కథానాయకుడు చిన్న పిల్లాడుగా
కనిపించడం లో విడ్డూరం ఏమీ లేదు

అన్న వారసత్వం వచ్చినా
సినిమాలలో సింహా గా ఉంటున్నా
ఆ పార్టీకి కార్యకర్తగా వస్తానని
ఎక్కడ పోటీ చేయమంటే చేస్తానని
తన పేరుకు తగినట్టే బాలయ్యగా తన
రాజకీయ గమ్యం గురించి చెప్పిన బాలయ్యను
చిన్న పిల్లాడు గా చిరంజీవి చెబుతున్నాడు

అన్న వారసత్వం ఇదే చిరంజీవికి
వచ్చి వుంటే ఓ సారి ఊహించండి
మన ఊహా జీవి ఇంకెంత ఊగిపోయి ఉండేవాడో

తెరపై సంపాదించిన పేరు
రోజు రోజు కూ ఖర్చు పెడుతూ వున్న
చిరంజీవి కొద్దో గొప్పో మిగిలిన పేరును
కొంచమయినా అట్టి పెట్టుకోవాలని
కోరుతున్న అభిమానులు కోకొల్లలు

2 స్పందనలు నుండి “మరో ఆంధ్రా అన్న” కు


  1. 1 katta vijay 8:57 పూర్వాహ్నం వద్ద జనవరి 10, 2012

    చిత్తశుద్దితొ రాజకీయాల్లొకి రావాలి – చిరంజీవి (నేటి మాట)

  2. 2 Mai Prasad 11:28 పూర్వాహ్నం వద్ద జనవరి 25, 2012

    chiranjeevi ki chaaki reevu ani pettukoavachchu gaa. ninnu choosinoadu pandiki vaapu ani pettukuntaadu. edaina ea partiality leakundaa veastea nii web site ki manch pearu vastaadi


ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )




వీక్షణలు

  • 265,805

 

జనవరి 2012
సో మం బు గు శు
« డిసెం   Feb »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి


Follow

Get every new post delivered to your Inbox.

Join 128 other followers