వారసత్వ వరంగా రాని ముఖ్యమంత్రి పీఠం కోసం
అపర గజినీ అవతారం ఎత్తి
తనకే ఓదార్పు అవసరమయ్యే దశలో
తను చేస్తున్న ఓదార్పును ఒకింత సడలించి
సారా మృతుల సందర్శించి
ఉపన్యసిస్తూ పాలక ప్రతిపక్ష నేతలిద్దరికీ
బుర్ర లేదని తేల్చాడు
పాపం తన బుర్ర విషయాలను ఇముడ్చుకోలేదని నిరూపించాడు
బెల్టు షాపులను తన బాబే పెట్టించి
వీధి వీధి కి మద్య యజ్ఞ ఫలాలను అందించిన ఘటనలు
తన బుర్రలో నుండి గల్లంతు చేసుకొని
నియోజక వర్గ స్థాయిలోనే మద్యపు విక్రయాలు చేస్తానని
నాన్న పథానికి మంగళం పాడే మహోపన్యాసం చేసాడు
ఎ-1 అయిన తను ఏక్షణం అయినా
ఎదురు చూస్తున్న ఎ-2 దగ్గర చేరతాననే ఎరుకతో
ఇలాంటి ఏమరు పాటును ప్రదర్శించడం
మనం సానుభూతితో అర్థం చేసుకోవలసిన అంశం
గళం ఘోషించడం అంటే
well said