సునామీలు సృష్టించిన రాజ్యం
వీర భోజ్యం దొరక్క
కనీశ పోషణ కరువై
చెయ్యి సాక్షిగా చంపబడి
సమాధి కాబడింది
సమాధికి సమర్పించాల్సిన పుష్పాలను
రాజ్య వీరులు జనాల చెవుల్లో పెట్టి
చెయ్యందిస్తున్న రాష్ట్ర నడిబొడ్డు
భవానీ ద్వీపాన్ని
మొదటి ధపాలో
రాజ్య వీరులు దొడ్డిదారి భోజ్యంగా తెచ్చుకొని
మింగబోతున్నారు
పంచలూడ గొట్టమని చెప్పే
కథానాయకుల వేషం కూడా
పగటివేషం అయిన వేళ
వెఱ్రి వాళ్లకు గోరు చుట్టమీద రోకటి పోటే
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు