డిసెంబరు 20th, 2011ను భద్రపఱచు

అగ్ర స్థానం ఆంధ్రాదే

గ్రామ గ్రామానా తాగడానికి
బెల్టు షాపులు తెరిచి
తాగుబోతులను తయారు చెయ్యడంలో గానీ
ఆడిని అడిగినంత ఇవ్వమని
వలువలు తప్ప అంతా వలుచుకొని
అమాత్యుల వరకు పంచుకోవడం లో గానీ
పారదర్శక పాలన మన సొంతం

సాటి అమాత్యులు అవినీతి పరులు అని
ఆరోపిస్తున్న అమాత్యుడి పైనే
బహిరంగంగా దాడి చేయడం చేస్తుంటే
అమాత్యుడి భద్రతనే గాలికి వదిలేసి
శాంతంగా చూస్తున్న
శాంతి భద్రతల శాఖను రాష్ట్రం లో
మొట్ట మొదటి సారి ఓ మహిళకిచ్చామని
సంకలు గుద్దుకొంటున్న సన్నాసులం మనమే

ఇసుకను కూడా వదిలి పెట్టని
ప్రజా ప్రతినిధులు ఉన్న రాష్ట్రం మనదే

కోటలు కట్టిన సాటి వాళ్ళను చూసి
పోటీ పడుతూ వస్తున్న
ప్రజా ప్రతినిధులు
రేపో మాపో
బిక్షగాళ్ళకు ఓ చట్టం చేసి
రోజు వారీ బిక్షంలో
భాగం కావాలని అడగరనే నమ్మకం
లేని రాష్ట్రం మనదే

దానిని ప్రజా ప్రతినిధులు మొదలు
మొరిగించే మీడియా వరకు
పంచుకోదనే నమ్మకం లేని రాష్ట్రం మనదే

జనాభా కన్నా
ఎక్కువగా బియ్యం కార్డులతో
బీద వారి బియ్యాన్ని తినడం చాలక
ఇంకా కార్డులు చాలవనే
మన ‘భాగ్య’ నగరం
రాజధానిగా ఉన్న రాష్ట్రం మనదే

బియ్యం కేజీకి రూపాయి తగ్గించిన గొప్పదనం గురించి
కోట్లతో ప్రకటనలు గుప్పించి
అలనాటి అవినీతి ‘దేవుడి’ని మరిపించుకొంటూ
మురుసిపోతున్న రాష్ట్రం మనదే

ప్రైవేటులో కొత్తగా వచ్చే ఉద్యోగాలకు
జీతమిచ్చి అర్హులనే ఎంచుకొంటారు
లేదా చేర్చుకొని తర్పీదు ఇచ్చుకొంటారు
ఈ తంతును కూడా తన తంత్రంతో
లక్షల్లో ఇప్పిస్తానని
ముద్దు ముద్దు తెలుగు మాటల్లో
ముఖ్యమంత్రి గారు చెబుతుంటే
చెవినిల్లు కట్టుకొని వింటున్న చదువరులు
వున్న రాష్ట్రం మనదే.


వీక్షణలు

  • 265,805

 

డిసెంబరు 2011
సో మం బు గు శు
« నవం   జన »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

నెలవారీ ఉతికినవి


Follow

Get every new post delivered to your Inbox.

Join 128 other followers