ప్రజా సంపదను కాచుకోవలసిన వాడే
కన్న కొడుకు కోసం కన్నం పెట్టాడు
అదేమని అడిగే వారికి
కన్నం నుండి వచ్చే వాటిని ఒడుపుగా పట్టే
కొడుకునే సాక్షిగా పెట్టాడు
రంగులు పులిమి చెబుతున్న సాక్ష్యానికి
కొడుకు తాను ఎంత వసూలు చేస్తున్నాడో
ప్రశ్నించే వాళ్ళు కూడా అంతే వసూలు చేయాలని
నానా యాగీ చేసాడు
పాపం పతాకస్థాయికి చేరాక
పావురాళ్ళ గుట్ట నాన్నకు ప్రాప్తిస్తే
కొత్త కాపలాదారు ఉద్యోగం రాని కొడుకు
కన్నం గురించి కప్పలేక
సమాజం మొత్తం బొక్కలే అని ఎదురు బొంకుతున్నాడు
తనను సాక్ష్యంగా భరిస్తున్న వారి నెత్తిన
భస్మాసుర హస్తం పెట్టి భరించండి అని
కన్నం నుండి వచ్చిన దానితో కట్టిన
కోటలు సజీవ సాక్ష్యాలుగా
నిలువెత్తు నిలుస్తుంటే కూడా
తనకు గిట్టుబాటు కావడం లేదని గింజుకొంటున్నాడు
న్యాయస్థానాల్లో అమ్మ ఎక్కడ అపజయమ్మ అవుతుందో అనే
ముందస్తు అంచనాతో న్యాయస్థానాల పైనే నానా యాగీ చేస్తూ
విజయ సారధి విచారణల సాయి అయిన ప్రస్తుతాన
వింత వాదనలు ప్రస్తావిస్తున్న కన్నపు సాక్షి
కారాగారం కోసం కడుపుమండిన ఎందఱో
ఎదురు చూస్తున్నారు.
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు