మార్చి 19th, 2010ను భద్రపఱచు

విసిగి పోయే వరకు వాదించు కొనేలా వాయిదాల మీద వాయిదాలతో

దేశాలు, ప్రాంతాల మధ్య దూరం చెరిగి
ప్రపంచం ఓ సాలెగూడు అంత చిన్నది అయ్యింది.

తెలియనిది తెలుసుకోవాలి అనుకొన్న తక్షణం
గాగుల్స్ లేకున్నా గూగుల్లో వెదికితే
తెల్లబోయేలా అన్నీ తెరముందు తెలిసిపోతోంది.

రంగులు మార్చే వాళ్ళ గురించి
క్షణాల్లో, సాలెగూడు మొత్తానికి చాటింపు వేసి
ఒకరికి ఒకరు హెచ్చరించుకొంటున్నాం.

కానీ మన రాజకీయ నాయకులు మాత్రం
సాలెగూడులో మనం సాగిస్తున్నవి చూచి ఓర్వలేక
ప్రాంతాలా వారీ మనం విడిపోయి
విసిగి పోయే వరకు వాదించు కొనేలా
వాయిదాల మీద వాయిదాలతో
వేర్పాటు వాదాలు రుద్దుతూనే ఉన్నారు.

ఏ రోగమొచ్చినా ప్రజల రొక్కంతో బాగుచేసుకొనే వీళ్ళు
భావోద్వేగాలతో గేములాడి
ప్రజల ప్రాణాలు మంచినీళ్ళ ప్రాయంలా హరిస్తున్నారు.


వీక్షణలు

  • 265,805

 

మార్చి 2010
సో మం బు గు శు
« Feb   ఏప్రి »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి


Follow

Get every new post delivered to your Inbox.

Join 128 other followers