పార్టీకి ప్యాక్షనిస్టు నాయకుడు కావాలి

క్రమశిక్షణ తప్పి కళావిహీనమౌతున్న పార్టీకి
పక్షపాతంతో అనుచరులనే అందలం ఎక్కించినా
మిత్రులుగా పక్క రాష్ట్రాల్లో వేరే పార్టీ లో ఉన్న ఘనులకు మొదటి బంతికి పిలిచి ఘుమ ఘుమ లాడే వంటకాలతో వడ్డించినట్లు కరువు తీరా ఎకరాలకు ఎకరాలు భూములు, గనులు హద్దులు చెరిపి వడ్డించినా
ప్రత్యర్ధులను పనికరాకుండా చేసినా
కుటుంబ సభ్యులను వ్యాపార సామ్రాట్టుల జాబితాలో అగ్రస్థానాలకు పోటీ చేయించినా
ఆది అంతం లేని అవినీతినీతితో అలరిస్తున్నా
ఆధ్యాత్మిక ముసుగులో కుటుంబ సభ్యులు విదేశీ నిధులు కొల్లకొడుతున్నా
ఏక పక్షంగా ఏమి చేసుకున్నా
అధిష్టానం అచ్చెరువుతో చూసేలా
వృద్ధ నాయకులు ఉలుకూ పలుకు లేకుండేలా
నాయకుల నసుగుడు లేకుండా
కార్యకర్త కిమ్మని ఉండేలా
తనకు తాను ప్రత్యర్ధులను పరిహసిస్తూ పాలించే
ప్యాక్షనిస్టు నాయకుడు కావాలి
షరతు : మునగదీసి పడుకొని నిదుర పోతున్నా అధిష్టానం అని వినపడితే ముకుళిత హస్తాలతో నమస్కరించే నమ్మకస్తులు కావాలి.

5 స్పందనలు నుండి “పార్టీకి ప్యాక్షనిస్టు నాయకుడు కావాలి” కు


  1. 1 Venkata Appa rao Mattegunta 10:58 అపరాహ్నం వద్ద నవంబరు 6, 2009

    Really wonderful ,thought provoking article.

  2. 2 మంచు పల్లకీ 6:05 పూర్వాహ్నం వద్ద నవంబరు 7, 2009

    ….. లాంటి ఫాక్షనిస్ట్ కావాలట.. అలాంటి కరుడుగట్టిన ఫాక్షనిస్ట్ దొరుకుతాడా?

  3. 3 raamudu 6:59 అపరాహ్నం వద్ద నవంబరు 7, 2009

    నిజం నిప్పని ఊరికినె అన్నారా?

  4. 5 YSR 1:52 అపరాహ్నం వద్ద నవంబరు 24, 2009

    అరేయ్,

    నేనే అసలైన ఫాక్షనిస్టు అనుకున్నా.
    ఇక్కడ ఎముడు నన్ను ఏపుకు తింటున్నాడు.
    దయచేసి భూలోకంలో ఎదవపనులు చెయ్యకండి.

    ఈమధ్య ఏమలోకానికి ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చింది.

    మీ,

    YSR


ప్రత్యుత్తరమిమ్ము




వీక్షణలు

  • 84,528

 

నవంబరు 2009
సో మం బు గు శు
« అక్టో   డిసెం »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు

Sarath ' Kaalam' on పేరడీ దీక్ష
ASHOK on పేరడీ దీక్ష
telangana on పగిలిన ముక్కల చుట్టూ
అనానిమకుడు on బొబ్బులివా?
సుజాత on బొబ్బులివా?