సినిమాల్లో రౌడీలు ప్రత్యర్ధులను భయబ్రాంతులను చేయడానికి పబ్లిక్లో బట్టలూడదీసే సీన్లు మనం ఎన్నో సిన్మాల్లో చూసాం. అచ్చు అలా ప్రత్యర్ధులను బట్టలూడదీసి కొడతాం అనే వాఖ్యలు మన హీరో చిరంజీవి పెట్టిన పార్టీ నాయకులనుండి వింటున్నాం. ఇంతకు ముందు హీరో అభిమానులు కొందరు పబ్లిక్ గా కొట్టి చూపించారు. పురుషులను అయితే పంచలూడగొడతాం అని బెదిరిస్తారు . నెక్స్ట్ సీన్లో పంచన చేరి పోవడానికి సిద్దం అయిపోతారు. బట్టలూడదీసికొని కొట్టించుకొనే వాళ్ళు కూడా బాధపడకుండా నెక్స్ట్ సీన్లో వాళ్ళ ఆదరాభిమానాలను చూసిన తరువాత ఆవేశపడాలి అని మనవి. సినిమాల్లో అయితే రౌడీలు, విలన్ల కోసం దర్శకులు ఈ సీన్లను పెడుతారు. మన కథానాయకుడి సారధ్యంలో నడుస్తున్న పార్టీల్లో నాయకులు ఇలాంటి సన్నివేశాలను డైలాగ్ లతో రక్తి కట్టిస్తూ బుల్లితెరలను అలరిస్తున్నారు. పేరుకే దర్శకుడైన కథానాయకుడి కంట్రోల్ లేకుండా వచ్చే ఇలాంటి డైలాగ్ లతో, అప్పుడప్పుడూ సమాధానం చెప్పలేని ప్రత్యర్ధుల ప్రశ్నలకు గాందీ గిరీ అంటూ పూలు పంపే సన్ని’వేషాల’తో, సొంత పార్టీ ఆఫీస్ ముందరే ధర్నాలు చేసుకొనే విన్నూత్న సన్ని’వేషాల’తో మార్పు చూపెడుతున్న మరియు మారడానికి సదా సిద్దంగా ఉన్న రాజ్య నేత మమ్ములను మరికొంత కాలం రంజింపజేయుటకు విలీనాలకు వేసే ఉచ్చుల పాలబడకూడదని మా మనవి.
వీక్షణలు
- 84,528
తడి ఆరని ఉతుకులు
- పేరడీ దీక్ష
- పగిలిన ముక్కల చుట్టూ
- బొబ్బులివా?
- ఎవరివ్వగలరు? ఎంతియ్యగలరు?
- తనకోసం సమైక్యాంద్రా అనాలా కుటుంబం కోసం సామాజిక తెలంగాణా అనాలా
- ఒక్క సారి కళ్ళు తెరువు మరొకరు కన్ను మూయకముందే
- నాయకులకుండే సంకుచిత్వం ప్రజల్లో ఉందని ప్రతిపాదిస్తున్నారు
- మొండికేసిన బుద్దుని కూడా
- ఇటలీ దేవత ఇరుక్కు పోయారు
- కొందరు మైకంలోనే ఉంటే ఎంతమేలో
- అత్తోల్ల ఊరు అచ్చిరాదు
- అలకు ఒడ్డున పడే చేప మల్లే
- కృతజ్ఞత కూడా లేకుండా కాపాడినవాడి కొడికిని వాడెవడో నాకు తెలియదు అన్నాడు
- శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది
- గాంధీ ఫోటోలకు నైవేద్యం
ఉతుకుతో చిరిగినవి
నెలవారీ ఉతికినవి
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు
| Sarath ' Kaalam' on పేరడీ దీక్ష | |
| ASHOK on పేరడీ దీక్ష | |
| telangana on పగిలిన ముక్కల చుట్టూ | |
| అనానిమకుడు on బొబ్బులివా? | |
| సుజాత on బొబ్బులివా? |
ఏమి చేద్దాం మాస్టారు. శుద్ధంగా సినిమాలలోనే నటించి వుండివుంటే చిరంజీవికి ఈ దుర్గతి పట్టేది కాదు. ఇప్పటికి మించిదేమి లేదు. చిరంజీవి తిరిగి నటనకు వచ్చేస్తే శేష జీవితాన్ని సార్థకం కాచించుకున్న వాడవుతాడు. ఎన్టీర్ కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒక సినిమాలో నటించాడు కదా!! ఆయనను అనుసరించి పేరు-పదవి కొట్టేదాం అని చిరంజీవి గనక అనుకోని వుంటే, ఆయనలాగే ఇప్పుడు ఒక సినిమా చేయవచ్చేమో?!