జెండా కాన్సెప్ట్ నాన్నదే

నాన్న ఉన్నప్పటి నుండి మొగ్గతొడిగి నానుతున్నదే ఇది అని రాజ్యంతో పొత్తు వద్దని గుర్రుమన్న జగన్ వర్గానికి ప్రత్యర్ధి వర్గాలు గుర్తుచేస్తున్నాయి . జగన్ వర్గంలోని రఘు వీరుడు కూడా ఇప్పుడైతే తొక్కేస్తున్నారని తొడలు గిల్లుకొని వాపోతున్నాడు కాని అప్పుడు జగన్ నాన్న రాజ్యం జెండా పీకించే పనులు చేసినట్టు ఎస్ ఎస్ ఎస్ అని మూడు మార్లు ఈ రోజు ఉదయం మీడియాలో ఒప్పుకున్నారు. నాన్న రాజ్యం జెండా పీకించే పనులు చేస్తుంటే రత్నం తన ఉత్తర సాక్షిలో ప్రతిపక్ష నాయకుడు, మీడియా ప్రతినిధి పన్నిన కుట్రగా కథలు అల్లాడు. ఈ రోజు ప్రత్యర్ధులు అడిగే ప్రశ్నలకు అల్లాడుతున్నాడు. ఆ రోజు నాన్న రాజ్యం నాయకుల ప్రమేయం లేకుండా జెండా పీకించే పని చేసాడు. ఈ రోజు రాజ్యం నాయకుల ప్రత్యక్ష ప్రమేయంతో జెండా పీకడానికి పార్టీలోని వర్గాలు ప్రయత్నిస్తే ఆ నాయకుడు వచ్చి ఎక్కడ తమ సముద్రంలో తిమింగలం అవుతాడో లేదా తాత్కాలికంగా ఎక్కడ తమ ప్రభకు అడ్డు వస్తాడో లేదా మహా నగర ఎన్నికల సమయాన ఎక్కడ మనలను మరిపిస్తాడో నని ఉన్న ఫలంగా ఉలిక్కి పడ్డారు. శవం ఉన్నంగనే మీరూ రాజ్యం నాయకులను సంప్రదించారు కదా అన్నదానికి సమాధానం చెప్పలేక పోతున్నారు. మంది సొమ్ముతో పెట్టిన పేపర్లో రాసిన కధనాలే కాంగ్రెస్స్ లో కధానాయకుడు అయ్యే పాత్రకు శరాఘాతాలు అవుతోంది. టికెట్లు అమ్మినంత సులభంగా రాజ్యాన్ని చేతిలో పెడదామని డూ డూ బసవన్న అంటూ సిద్దం చేసిన రాజ్యం నేత ఆత్మబంధువు ఆనవాయితీగా మరోసారి ఎన్నికల ముందే రాజ్యాన్ని అప్రదిష్టపాలు జేసి అయోమయానికి గురిచేసి స్పష్టత లేని పార్టీగా స్పష్టీకరించాడు.

1 ప్రతిస్పందన నుండి “జెండా కాన్సెప్ట్ నాన్నదే” కు


  1. 1 YSR 2:54 అపరాహ్నం వద్ద నవంబరు 24, 2009

    అందరూ యదవలె.
    ప్రజలకు ఒరిగింది ఏమి లేదు.


ప్రత్యుత్తరమిమ్ము




వీక్షణలు

  • 84,528

 

నవంబరు 2009
సో మం బు గు శు
« అక్టో   డిసెం »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు

Sarath ' Kaalam' on పేరడీ దీక్ష
ASHOK on పేరడీ దీక్ష
telangana on పగిలిన ముక్కల చుట్టూ
అనానిమకుడు on బొబ్బులివా?
సుజాత on బొబ్బులివా?