జెండా పీకేద్దాం అని అన్నప్పుడు ఎవరు పీకుతారో చూస్తాను అని తీవ్రంగా శపథం చేసాడు.
ఈరోజు కాంగ్రెస్స్ నాయకుల మాటలు, మీడియా విశ్లేషణలను చూస్తుంటే ఆ శపథం నెరవేర్చుకొనే మార్గంలో చిరంజీవి విజేత అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జెండా కనిపిస్తే కదా పీకుతారు ఆ జెండాను తనే కాంగ్రెస్స్ జెండాలో కలిపేస్తే వేరే ఎవ్వరూ జెండా పీకేద్దాం అనే అజెండా చేపట్టారు కదా అని చిరంజీవి తీవ్రంగా ఆలోచించినట్లు ఉంది. మార్పని చెప్పితే ఏమారని జనాల నిర్ణయం నిఖార్సైనదే అని నిరూపిస్తూ, మార్పంటే ఇతర పార్టీలలో నుండి మనసు మార్చుకొని తన రాజ్యానికి వచ్చిన అభిమానులను తాజాగా తనే మారి ఏమార్చాడు. సామాజిక శకటం అంటూ నమ్మిన రైలు డిపాజిట్లు తీసుకొని వెళ్ళిపోతే జనాలెందుకు రైలును అలా పంపారో ఆలోచించక కోపగించుకొని రైలు ను రద్దు చేసుకొని సూర్యుడిని పట్టుకొని ఓ వెలుగు వెలుగుదామని అనుకొన్నాడు. అంతలోనే మార్పుకు లోనై సూర్యుడిని అస్తమింపజేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాడు. అధికారం కోసం కాలు గాలిన పిల్లిలా అల్లాడిపోతూ వచ్చి జనాలే పిలిచారు అందుకే వచ్చాం అని చెప్పి కాంగ్రెస్స్ వాళ్ళు పిలిచారని వెళ్ళిపోతూ జనాలను వెర్రి వాళ్ళనుజేశాడు. సేవే లక్ష్యం అని చెప్పి అధికారమే లక్ష్యంగా అర్రులు జాస్తూ వెళుతున్న చిరంజీవి కాంగ్రెస్స్ సముద్రంలో ఓ బావురు కప్పలా ఇమిడి పోవడానికి నిర్ణయించుకొంటే అంత కన్నా ఆత్మాహత్యా సదృశ్యం వేరే ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్స్ లో జనాల మధ్య తిరగక హస్తినలో అధిష్టానం చుట్టూ తిరిగి రాజకీయం చేసే సీనియర్ నేతల చేతుల్లో పాపం చిరంజీవి ఓ పావు అయ్యాడు అని జాలి పడుతున్నారు విశ్లేషకులు. కమ్మ లాబీయింగ్ అడ్డుకొందని ఆరోపించిన జగన్ వర్గం తమకు చెక్ పెట్టడానికి వ్యూహం పన్నిన వర్గపు పోటుకు తేరుకోడానికి కొంచం సమయం పట్టొచ్చు. జెండా పీకీద్దాం అని వ్రాసిన కథ వెనుక రామాజీ చంద్రబాబుల కుట్రవుందని కుత కుత లాడుతూ కధనాలు వ్రాసారు సాక్షిలో. జెండా ఎవరూ పీక కుండా కాంగ్రెస్స్ జెండాలో విలీనం అవడానికి వెనుక జరుగుతున్న లాబీయింగ్ గురించి లాజిక్కులు లాగడానికి సాక్షి ఎందుకంత సమయం తీసుకొంటున్నదో.
Chiranjeevi is a cheater. I was a fan to him. Today i shame to be as a fan to him.
క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్ ……
వినపడ్డాయనుకుంటా…
Well said. కాకపోతే అక్కడ కూడ చ్చీ కొట్టించుకొన్నట్లున్నారు. కాంగ్రెస్స్ ఆటలో ఓ పావు అయ్యాడేమో మన అందరివాడు. పాపం బామ్మర్ది వేలంపాటి పెట్టి అమ్మేద్దమనుకొని కూర్చున్నా కొంటానికి ఎవరూ రెడీ గా ఉన్నట్లులేరు మనోడిని.
విలీనం చేసెయ్యనివ్వండి. పార్టీలు ఎక్కువగా ఉంటే ఎలెక్షన్ కమిషన్ కి ఖర్చు ఎక్కువ అవుతుంది.
మీ చాకిరేవు లో బాగా వుతికి పారేస్తున్నారు!ప్రతి అక్క్షరం
ఓ అద్భుతం! ఇలాటి నిజాలు మరిన్ని వ్రాయండి.
Edi emi ayina mana andhra 1 st bakara Chiru ( valla fans ni kuda bakara chesaduanukondi) 2 nd inka KCR ne…..