తనొస్తే బగ్గుమనే దేశ భక్తులకు జడిసి
పాలనా పగ్గాలను ఒడిసి పట్టడానికి
తమ వంశంకురానికి అందించటానికి
తన నిఖార్సైన త్యాగనిరతిని నిరూపించుకొంటూ
తెలుగు ప్రధానిచే తయారుచేయబడిన
ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నోకోబడని
మన్నికైన మంత్రిని
మా ప్రధాన మంత్రని
తమ భావి తరాలకోసం బాటలు వేసింది.
జనాల గుండెల్లో నాయకునిగా నిలపడానికి
తమ బాబును గుడిశెల్లో నిదురింప చేస్తోంది.
తమ రాణింపు కోసం రంగం సిద్దం చేసిన
మన పాలక వంశాలను వద్దంటోంది.
మన పాలకులు తమ వంశాలకు అధికారం ఇస్తారో లేదోనని
ముందే శంకించో లేదా ముందు చూపుతోనో
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని
మైన్స్, స్టీల్ ప్లాంట్స్, సిమెంట్ ఫ్యాక్టరీస్, పవర్ కంపెనీస్
టి వి చానల్స్, న్యూస్ పేపర్స్, భూములు
తము అధికారంలో ఉండంగానే తమ వారసులకు
వాటంతట అవే వచ్చేలా
ప్రతిపక్షాలు కూడా అబ్బుర పడేలా
పాలనా చాతుర్యాన్ని ప్రదర్శించారు.
ఆ అడ్డూ అదుపూ లేని చాతుర్యాన్ని
ఏనాడూ తగ్గించని త్యాగశీలి
తన వారసుని భవిత కోసం
చతుర నాయకుల వారసత్వాన్ని వద్దంటోంది
కాదు గీదని వస్తే లోపల కసిరినా
వచ్చినోల్ల చేతనే
ఆ పదవికి తమ వయసెంతని చెప్పిస్తోంది.
Its true anniah