పోలేరమ్మ ముందర తనెంత పోరగాడో

దేవుడి మరణంతో
దేవుని భక్తులంతా
పార్టీ పోలేరమ్మను మరచి
దేవుని బిడ్డ దగ్గరకు పొలోమని
పోలేరమ్మ వర ప్రసాదుని వలదని
దేవుని బిడ్డకు కిరీటం ఎట్టాల్సిందే నని
కిచ కిచలతో కిష్కింద కాండ చేసి
పోలేరమ్మకు కోపం వచ్చేలా చేసారు.
ఇందులో పోలేరమ్మ చెంతన ఉండి
పోరే పోతురాజుల పొత్తు కూడా ఉంది.
పోలేరమ్మ ముందర
తనెంత పోరగాడో అర్ధం అయ్యి, మోకరిల్లి
పోలేరమ్మ మాట పొల్లు పోకుండా వింటానని
తన బాగోగుల బాధ్యత ఆమె ఇష్టమని
అన్నీ ఆయమ్మే చూసుకొంటుందని
పూనకం వచ్చినట్టు సంతోషంగా చెప్పి
నమ్మిన దేవుని భక్తులను
నాటకీయంగా
లౌక్య పరీక్షలోకి నెట్టాడు
దేవుని బిడ్డ.
లౌక్యంలో పండిన వీర భక్తులు
తిప్పారు తమ నాలుకను
దేవుడి బిడ్డ నోరు తెరిచి
కిరీటం అస్సలు అడగలేదని
పనీ పాట లేని జనం,
అనుంగులకు అడ్డుపడే అధికారులచే
మరణ వాంగ్మూలం రాయిస్తున్న ఛోటా నాయకులు,
వరద బాధితులనికూడా వదలకుండా
వలువలతో సహా దోచే కార్యకర్తలే
కాస్తా తీరిక చేసుకొని
దేవుని బిడ్డకు
కిరీటం పెట్టమన్నారని
కిత కితలు పెట్టకున్నా నవ్వోచ్చేలా
నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు.

10 స్పందనలు నుండి “పోలేరమ్మ ముందర తనెంత పోరగాడో” కు


  1. 2 vinay chakravarthi. Gogineni 10:52 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 23, 2009

    nice man…….but come out from well……..y ru hiding TDP…..
    why r u not writing abt sitadayakaerreddy issue………..first see ur back man before pointing other’s back……….

    “అనుంగులకు అడ్డుపడే అధికారులచే
    మరణ వాంగ్మూలం రాయిస్తున్న ఛోటా నాయకులు “

  2. 3 జాటర్ ధమాల్ 10:57 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 23, 2009

    ఇందులో వింత ఏముందండి …అందరు దొంగలే …ఈయనగారు వెళ్లి ఏదో పీకుతా చిమ్పుతా అన్నాడు గాని …పోలేరమ్మ ఇది చెప్పింటుంది..ముయ్యకపోతే , నీ దొంగ సంపాదన రోజుకొకటి చొప్పున బైట పెడతాను …మూసుకొని నీ స్థాయి లో నీవు వుండు అని …

    మనకు ప్రత్యామ్నాయము వుంది ఇలాంటి వెధవల్ని ఎన్నుకున్నందుకు అనుభవించు రాజా అని పాడుకోవటమే …

  3. 4 bonagiri 11:40 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 23, 2009

    ‘దేవుడి మరణంతో’ ఏమిటండి?
    దేవునికి మరణం ఉండదు.
    మరో పదం వాడవలసింది

  4. 7 jagan 1:15 అపరాహ్నం వద్ద అక్టోబర్ 23, 2009

    Hi Vinay!!

    what is the meaning of ‘y r u hiding TDP’?
    first learn how to write a comment.

    ‘first see ur back man before pointing other’s back……….’?
    who is seeing whose back here? r u seeing other back or what?

    where is the question of TDP here atleast?

    I am seeing you every where writing some nonsense/ non relevent comments. But I am telling you, it wont get any hits in your blog, bcoz by seeing ur name/comment ppl will undersatnd what is ur standard.

  5. 8 krishna 2:59 అపరాహ్నం వద్ద అక్టోబర్ 23, 2009

    @వినయ్,
    “why r u not writing abt sitadayakaerreddy issue………..first see ur back man before pointing other’s back……….”
    సీతా దయాకరరెడ్డి గురించి కంటే, కాంగీ కి చెందిన రాజకీయనాయకులగురించే చనిపోయిన రాజేశ్వరి చెప్పిన సంగతి మీకు తెలియదా? సీతా దయాకరరెడ్డి మాట్లాడినప్పుడు అక్కడే ఇంకా చాలా మంది అధికారులు ఉన్నారు అని మీకు తెలియదా? నిజంగా సీతా దయాకరరెడ్డి కారణం అయితే, రాజేశ్వరి ఇంకా hospital లో బ్రతికి ఉండగానే వెళ్లి పరమార్శించి వస్తుందా, ముఖ్యంగా తనే కారణం అయితే?

    ఇక వెనక పక్క చూసుకోవటం గురించి, అది ఎవరది వాళ్లు చూసుకొని, దానిని మూసుకొని వుండటం మంచిదేమో కదా :)

    btw, if you think this is harsh comment on you, re read your comment and think about it

  6. 9 Rao 6:52 అపరాహ్నం వద్ద అక్టోబర్ 23, 2009

    There is nothing wrong in writing this post. If Jangan does not want the DM post, why he maintainted the silence for past 2 months. I could come out and Have told to public that He do not want CM post.

    In Ap, Haryana, MH , why people are thingking in wrong way. The percentage of votes plooed to oppostion vry larger than position parties. At least people shuld awake now and throw away the congress alleast now. Because Congress Just known that developmemt is needed in INDIA. before that this same congress ruled INDIA for 35 years, but what did they do except war on CHINA and PAK and Creating Emergency for Power. we have passed those darken days. Only when Adavani and Vajpayee comes into politics, Then Congress knew that INIDA Needs development.

    Please awake..please awake.. atleast now..

  7. 10 N M 5:28 అపరాహ్నం వద్ద అక్టోబర్ 24, 2009

    హస్తిన లో రాలిన నక్షత్రం
    గతి తప్పిన గడుగ్గాయి
    —————
    గుండె పగిలింది
    నిరీక్షణ ఎందుకు
    సాగుచున్నది
    జగమెల్ల ముందుకు
    —————-
    ఏవి ప్రభూ
    ఆత్మ ‘హత్యా ‘ కధనాలు
    ఏవి గుండె ‘పోట్లు’
    జగమెల్ల చల్లబదిపోయినట్లుందే !!
    ———————


ప్రత్యుత్తరమిమ్ము




వీక్షణలు

  • 84,528

 

అక్టోబర్ 2009
సో మం బు గు శు
« సెప్టెం   నవం »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

నెలవారీ ఉతికినవి

ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు

Sarath ' Kaalam' on పేరడీ దీక్ష
ASHOK on పేరడీ దీక్ష
telangana on పగిలిన ముక్కల చుట్టూ
అనానిమకుడు on బొబ్బులివా?
సుజాత on బొబ్బులివా?