ఆంధ్రా వాలా అన్నే అరవ తంబి తంబే

ఇటీవల తమిళ నాడులో ఉచిత కలరు టీవీలు ఇవ్వడానికి టి వి ఒకటికి, ఐదు వందలు అడిగితే ఆరవ తంబిలు, ఆ పాలక వర్గ అనుచరుల తీరుకు అరుస్తూ వెళ్లి మంత్రులకు మొరపెట్టుకొన్నారని తమిళ మీడియాలో న్యూసెన్సు. అదే మన మన పాలక వర్గ అనుచరులు వరద సాయం కొచ్చిన నిధులు వెయ్యి రొండు వేలు మినహాయించుకొని బాధితులకు ఇచ్చారు . బియ్యం, నీళ్ళు ఇతర సామగ్రి వాళ్ళ గోడౌన్లకు తరలించు కొన్నారు. అడగడం ఆంధ్రా వాలాలా ఇంటా వంటా లేదు, దబాయించి తీసుకోవడమే తెలుసు. మరీ అరిస్తే, వాళ్ళ మనుషుల పేర్లే కూపన్లలో కుక్కి పేద బాధితులను పేళ్లను కుక్కి నట్టు కుక్కి వాళ్ళే బొక్కేస్తారు.

ఈ విషయం మీడియా వాళ్ళు కధనాలుగా ప్రచురించి, చూపించి, రోశయ్య ను అడిగితే అత్యవసర పరిస్థితులలో ప్రభుత్వ గోడౌన్లు ఏవో ప్రైవేటువి ఏవో ఎలా తెలుస్తుంది అని తెల్ల మొహం వేశాడు. ఆయన అసలే అధిష్టాన దూతలు ఏమి చెబుతారో అని చెవులు రిక్కించి వినడానికి, ఎవడెవడు క్యాంపు ఆఫీసుకు వెలుతున్నాడో తెలుసుకోడానికి, సీనియర్ల ఇళ్ళలో ఫంక్షన్లకు పిలుపు ఎప్పుడు వస్తూందా అని కాచుకు కూర్చొని ఉంటే, ఇంతకన్నా వేరే ఏమి సమాధానం వస్తుంది. ఇన్నాళ్ళయినా బురద క్లీన్ చేయ లేదు అని ఓ ప్రక్క ప్రతి పక్షాలు బురద జల్లు తున్నాయి. ఇవన్నీ ఆంధ్రా పాలక వాలాలు పట్టించుకొంటే పరువేం గాను. అందుకే ఆంధ్రా వాలా అన్నే అరవ తంబి తంబే.

0 స్పందనలు నుండి “ఆంధ్రా వాలా అన్నే అరవ తంబి తంబే” కు



  1. ఇంకా వ్యాఖ్యలు లేవు

ప్రత్యుత్తరమిమ్ము




వీక్షణలు

  • 84,528

 

అక్టోబర్ 2009
సో మం బు గు శు
« సెప్టెం   నవం »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

నెలవారీ ఉతికినవి

ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు

Sarath ' Kaalam' on పేరడీ దీక్ష
ASHOK on పేరడీ దీక్ష
telangana on పగిలిన ముక్కల చుట్టూ
అనానిమకుడు on బొబ్బులివా?
సుజాత on బొబ్బులివా?