దళితులపై జరిగే దమన కాండను
ఆపడానికి అవసరార్ధం వినియోగించవలసిన
అట్రా సిటీ కేసులు
ఈ మధ్య పెట్టే సందర్భాలను చూస్తుంటే
సదుద్దేశంతో ఏర్పరిచిన ఆ చట్టం
చవకబారు ఎత్తుగడలకోసం
రాజకీయ నాయకుల చేతిలో
పావుగా మారుతోందని అనిపిస్తోంది
అదేపనిగా సంపాదకీయలతో సతాయించే
సంపాదకున్ని అరెస్టు చెయ్యడానికీ
ఒక పార్టీ నాయకుడు కారాపకుండా వచ్చేసినందుకు
ఇంకో పార్టీ నాయకుడు పార్టీ ఆఫీసులోకి రానివ్వలేదని
ఇంకో సందర్భంలో ఎదురు పార్టీ సర్పంచి పై
నిత్యం సభలో సతాయించే ప్రతి పక్ష ప్రజా ప్రతినిధిని పై
అవినీతిపై రాసాడని విలేకరులపై
ఇలా ఏ సందర్భం చూసినా
సేవ చెయ్యడానికి రాజకీయాల్లోకి
అంటే ఎంత నవ్వొస్తుందో అలా
సేవ్ చెయ్యడానికా చట్టం అంటే
ఆలోచించ వలసి వస్తోంది
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు