సన్న బియ్యం తింటే ప్రోటీన్లు కోల్పోయి
షుగరు, బి పి వస్తాయని
అమాత్యులు ఆలస్యంగానైనా అత్యవసరమైన
పరిస్థితులలో సెలవిచ్చారు.
అదే ఆరోగ్య సూత్రం ప్రకారం ఫాలో అయి పోయి
ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మద్యం అమ్మకాలను
ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆపించవచ్చు కదా.
ఆ పని చేయకుండా, దానిపై మాట్లాడకుండా
కేవలం, తెలీక గోరుముద్దలు దగ్గరనుండి అలావాటైన
సన్న బియ్యం గురించి గుబులు పడేలా చెప్పడం ఏమైనా బావుందా.
అయినా గంజి తాగడం మాని కొత్తలవాట్లు కొనసాగినంత కాలం
అత్యవసర సరుకులైనా, అలవాటైన మద్యమైనా కొండెక్కి కూర్చుంటాయి.
గంజెలా కాయాలో గతంలో కాసే వారిని కాకా పట్టి నేర్చుకోవాలి తప్పకుండా.
ఎందుకంటే దొడ్డ బియ్యంతో అన్నం వండుకున్నా పప్పు దొరకదు.
పప్పుకోసం, పాలకులు ఆలోచన చేసి,
కందులను విత్తనాలుగా ఇంకో వారంలో పంపిణీ చేస్తారంట పల్లెలకు.
ఇక అవి విరగ కాసి కోతకు వచ్చి కొట్టించుకొని
గింజలై గిర గిరా తిరిగి మరయంత్రాలనుండి పప్పై బయటకు రావాలి.
నే చెప్పేది వింటుంటే మీ తలకాయ గిర గిరా తిరుగుతోందా.
అట్టే ఉంటుంది మరి గంజి తాగ కుండా
కొని తెచ్చుకొన్న అలవాట్లకు తోడు కొనలేని పరిస్థితులను కూడా కొనితెచ్చుకున్నామైతిమి.
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు