ఒకప్రక్క క్రీస్తు పూర్వంలోనివి పుక్కిట పురాణాలని వాదిస్తూ
వాటిని ఉటంకించే వారిని టింకర శాస్త్రులని హేళన చేసే వారు
వారు చెప్పే ఆది సాంప్రదాయం ఎప్పుడో చంకనాకిపోయిందని లబ లబ మంటున్నారు
మరి ఇలా చెప్పే వారిని వక్రశాస్త్రులు అనవచ్చా?
ఈ కాలంలో కాపలా కాస్తూ ఆధునికత ఫలాలను చేతికి అందకుండా అడ్డుకొంటున్నది ఎవ్వరు?
అంత తీరిక ఎవ్వరికి ఉంది. అయినా వారు ఆ ఫలాలను
అడ్డుకొంటుంటే మిగిలిన వాళ్ళు వంగోని వంకాయలు కోస్తున్నారా?
బీరు మగ్గు పట్టు కొంటేనో మాంసాహారం తింటేనో సాంప్రాదాయాలను మాట్లాడడానికి అనర్హులా?
ఏమి చేసినా కర్మ సిద్దాంతం ప్రకారం అనుభవించక తప్పదని తెలిసే ఈ పని చేస్తారు.
అలా చేసే వారిని వెలేయమని ఏ సాంప్రదాయం చెప్పడం లేదు.
ఏ ప్రాణికి హాని తలపెట్టినా పాపం అని చెబుతుంది శాస్త్రం.
మితిమీరిన తాగుడు, జూదం వ్యసనం అంటుంది పురాణం.
వాటి ఫలితాలు కూడా అక్కడే చెప్పబడింది.
హిందూ మతం సముద్రమంతా విశాలమయినది.
వారికి పరమత సహనం, వేరే మత దేవుడి మాట వినబడ్డా
మనసులో మొక్కే ఔదార్యం ఆ మతం ఇచ్చింది.
ఈ సముద్రంలో ఎన్నో నదులు అంటే తెగలు ఉన్నాయి.
కొన్ని స్వచ్ఛమైన నదులలా మాంసాహారం భుజించని తెగలు ఉన్నాయి.
అట్టని ఆ తెగదే ఆ మతం అని ఒంటి మతం గాళ్ళని అనడం అంగీకారాత్మకం కాదు.
అంతా అర్థం చేసుకొనే దాంట్లో ఉంది తప్పితే దానిని వక్రీకరించి సమస్యగా చూపి
దానికి పరిష్కారం చూపక పరి పరి విధాల వాపోయే బ్లాగర్లు
ఏమి చెబుతున్నారో కొంచం గందరగోళంతో చెప్పడం కన్నా గమ్మున ఉండడం మంచిదేమో.
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు