ఎం ఎల్ ఏ గా రాజ్యం పార్టీ నేతగా చిరంజీవి అరెస్టు అవుతుంటే
మిగిలిన పార్టీ ఎం ఎల్ ఏ లు ఎందుకు పాల్గొనలేదు?
చిరంజీవితో పాటు దేవేందర్, కళా వెంకట రావు మరియు శోభారాణి మాత్రం అరెస్టు అయ్యారు.
కానీ వీళ్ళెవరూ ఎన్నికైన ఎం ఎల్ ఏలు కారు.
ఎన్నికైన పద్దెనిమిది మందిలో పద్నాలుగు మంది ఎం ఎల్ ఏ లు త్వరలో
పార్టీని వీడనున్నారని మీడియా అనుమానించే దానికి సంకేతమా?
ఇంకో ఏభై రోజులు పొతే పార్టీ పెట్టి ఒక్క ఏడాది అవుతుంది.
అంతవరకూ కన్నతల్లి లాంటి పార్టీని వీడేది లేదని కొత్త పార్టీ పెట్టి
చిరంజీవి పార్టీలో విలీనం చేసి ఓటమి రుచి చూసిన ఇంద్రులను ఇతరులను చిరంజీవి ఆపగలడా?
గ్రేటర్ ఎన్నికలలో గెలవకపోతే రాజ్య పరివారపు గెంతులను ఆపతరమా?
ఎవడు తవ్విన గోతిలో వాడే పడతాడు అనేది చిరంజీవి విషయంలో నిజమయ్యేట్టు ఉందా?
పార్టీ తొలినాళ్ళు అనుభవం ఉన్నవారిని ఆహ్వానిస్తే
తప్పేమి అని తప్పటడుగులు వేయించిన పాపం తమకే చుట్టుకొని
ఆ అనుభూతి ఎలావుంటుందో ఆస్వాదించే సమయం ఆసన్నమవుతోందా?
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు