వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని మతం పేరు చెప్పకుండా
రవాణా అధికారుల దగ్గర అనుమతి పొంది అన్య మత వేషంతో
శిబిరాన్ని ఏర్పాటు చేసి అన్యమత ప్రచారం చేసారు అని తెలుగు పత్రికల కథనం.
దానిపైన కొందరు నిరసించడం
తరువాత ఆ అనుమతిచ్చిన అధికారిని నిలదీస్తే
నాకు అలాంటి సంస్థ అని తెలియక అనుమతి ఇచ్చాను అని వివరణ ఇచ్చుకొన్నాడు.
పెళ్లి భోజనం అనంతరం విస్తరులను విసిరే దగ్గర కాకుండా
ఏకంగా బంతిలోకి వచ్చి రభస చేసే కుక్కల్లా ఉంది ఇలాంటి సంస్థల పాట్లు చూస్తుంటే.
ఇలాంటి చట్ట విరుద్ద పనులు చేయడానికి సేవ ముసుగు ఒక్కటి.
ఈ సేవ చేస్తాం అనే ముసుగు కొత్తగా రాజకీయాలలోకి వచ్చే వంచన పరుల హక్కు.
దానికి ఈ మత ప్రచారకులు గండి గొడితే ఇలాంటి సేవా సంస్థలను సేవ ముసుగులో వచ్చి
ప్రజా ధనాన్ని షేవ్ చెయ్యాలనోకొనే రాజకీయ నాయకుల గాటన కట్టక తప్పదు.
ఇటీవల సేవే లక్ష్యం అంటూ వచ్చి ప్రైవేటు సైన్యం అంటూ మూడు వందల మందిని
రక్షణగా ఉపయోగించుకొని ప్రసంగాలతో రక్తి గట్టించిన నాయకుడి తమ్ముడికి
సెక్యూరిటీ గార్డులు కావాలని ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చి తిరస్కరించుకొన్నారు.
నిజంగా సేవే లక్ష్యం అనే వ్యక్తులు స్తోమత ఉండీ ప్రజాధనంతో సెక్యూరిటీ కోరడడం ఎంతవరకు సమంజసం?
కొన్ని సొంత లక్ష్యాలతో వచ్చే ఇలాంటి సేవా సంస్థలను ప్రజలు కూడా అప్రమత్తత వహించి దూరంగా పెట్టాలి.
0 స్పందనలు నుండి “సేవ చేయడానికి ఏడు కొండలు ఎక్కాలా?” కు