విపరీత పోకడలకు చట్టబద్దతా?

స్వలింగ సంపర్కుల హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలుగా
మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి అని న్యాయస్థానం కోరింది.

ప్రాశ్చాత్య సంస్కృతులను మన దేశంలో పరవళ్ళు తొక్కించాలని
ఉబలాట పడే వాళ్ళు ఇక్కడ మన దేశ ప్రస్తుత పరిస్థితులకు
కొత్త ఇబ్బందులను సృస్టిస్తుందా అని గమనించి దానిని పరిగణలోకి తీసుకోవాలి.

ఇటీవల చట్టం నుండి తప్పించుకోడానికి సహజీవనం అనే పదం
వాడి ఒక ప్రముఖుడు బయట పడడం జరిగింది.
అదే పదాన్ని తరువాత బలవంతంగా సచివాలయ సాక్షిగా శృంగార కార్య కాలాపాలు చేసాడు
అని ఆరోపణ ఎదుర్కొన్న వ్యక్తి వాడి నేను ఆమెతో సహజీవనం చేస్తున్నాను అని బయట పడడం జరిగింది.

మన సమాజంలో ప్రేమించక పొతే ఆసిడ్ పోయడాలు
కత్తులతో నరకడాలు ఎత్తైన ప్రదేశం నుండి తోసేయడాలు
రోజు రోజు కూ పెరుగుతుంటే ఏమీ చెయ్య లేక చేష్టలుడిగి చూస్తున్నాము.

ఒక అందమైన క్రీడాకారిణి తనకు పెద్దలు కుదిర్చిన పెళ్లిని
చేసుకొంటుంటే తట్టుకోలేక రభస చేసే వాళ్ళను చూస్తున్నాం.

అక్రమ సంబంధాల వల్లా ఎన్ని హత్యలు జరుగుతున్నాయో
ఎన్ని కొంపలు కూలుతున్నాయో లెక్క లేదు.

కొత్తగా ఈ స్వలింగ సంపర్కాన్ని చట్ట పరంగా ఆమోదిస్తే
జరిగే పరిణామాలు ఊహించనలవి కాదు.

ఇప్పటి వరకు ఒక మృగాడు ఓ మహిళ పై మాత్రమె దాడి చేస్తున్నాడు
రేపు మన ప్రక్క నున్న మృగాడు మన పైనే దాడి చేయవచ్చు.
ఒక ప్రక్క కట్నంకోసం ఓ మహిళను పెళ్లి చేసుకొని
ఇంకో స్వలింగ సంపర్కితో సహా జీవనం చేస్తానని అనవచ్చు.
స్వలింగ సంపర్కులే మేము చట్టబద్దంగా ఓ రెండు ఏళ్ళు కాపురం చేసాం
కాని నన్ను నా భాగస్వామి మోసం చేసాడు లేక బలవంతంగా
నా ఇష్టం లేకుండా అనుభవించాలని చూస్తున్నాడు అని కోర్టు మెట్లు ఎక్క వచ్చు.
మాకు ఇది చాలదు మేము జంతువులతో కూడా అనుభవించేలా
అనుగ్రహించండి అని కోర్టు మెట్లు ఎక్కవచ్చు.
ఎయిడ్స్ మహమ్మారి కి ఏటా ఎంత మంది బలవుతున్నారో
లెక్కలు తెలియని మనకు ఇవి అవసరమా అని ఆలోచించుకోవాలి.
రోజు రోజుకూ కుప్పలు తెప్పలుగా కేసులు పోగేసుకొంటూ
ఉన్న కేసులతోనే సతమవుతున్న న్యాయస్థానాలు
సత్వర న్యాయం జరిగిలా ఏర్పాట్లు చేసుకొని
తరువాత ఇలాంటి విపరీత పోకడలను పరిశీలిస్తే మంచిదేమో అని నా అభిప్రాయం.

4 స్పందనలు నుండి “విపరీత పోకడలకు చట్టబద్దతా?” కు


  1. 1 MLFR 7:16 పూర్వాహ్నం వద్ద జులై 10, 2009

    >>>>>
    ఇప్పటి వరకు ఒక మృగాడు ఓ మహిళ పై మాత్రమె దాడి చేస్తున్నాడు
    రేపు మన ప్రక్క నున్న మృగాడు మన పైనే దాడి చేయవచ్చు.
    ఒక ప్రక్క కట్నంకోసం ఓ మహిళను పెళ్లి చేసుకొని
    ఇంకో స్వలింగ సంపర్కితో సహా జీవనం చేస్తానని అనవచ్చు.
    >>>>>

    ఇలాంటి వాటిని నేను కూడా రియల్ లైఫ్ లో చూసాను. ఒక మృగాడు పెళ్ళైన తరువాత కూడా అనేక మంది పరాయి మృగాలతో స్వలింగ సంపర్కం చెయ్యడం కొనసాగించాడు. అతని భార్యకి ఈ విషయం తెలిసి అడిగితే “నేను మగవాడిని, నన్ను అడగడానికి నువ్వెవరు?” అని ఎదురు సమాధానం చెప్పాడు.

  2. 3 MLFR 10:01 పూర్వాహ్నం వద్ద జులై 10, 2009

    అదేదో సినిమాలో హీరో అంటాడు “చట్టానికి కళ్ళు లేవని అనుకున్నాను, చట్టానికి బుర్రే లేదని అర్థమయ్యింది” అని. ఇలాంటి తీర్పుల్ని చూస్తోంటే ఆ డైలాగ్ నిజం అనిపిస్తోంది.

  3. 4 saipraveen 12:16 అపరాహ్నం వద్ద జులై 10, 2009

    సుప్రీం ఈ caseను తిరిగి విచారణకు తీసుకోవడం హర్షనీయం. ఈ సారైనా మన దేశ సంస్కృతిని, సంస్కృతి అని చెప్పడం కన్నా మన దేశ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ అత్యున్నత న్యాయస్థానం మంచి తిర్పు ఇస్తుందని ఆశిద్దాం.


ప్రత్యుత్తరమిమ్ము




వీక్షణలు

  • 77,132

 

జులై 2009
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

నెలవారీ ఉతికినవి