మళ్ళీ ఎన్నికలు!

లంచం ఇవ్వకుండా పని చేయించుకొనే పాలకులను
ఎన్నుకోవాలంటే మాకు తప్ప వేరెవ్వరికీ సత్తా లేదు అని
ఒక పార్టీ దశాబ్దాల తరబడి మాట్లాడుతూ
ఈ ధపా ఒక్క స్థానంలో విజిల్ వేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా అవినీతిలో ఆకాశమే హద్దుగా చెలరేగే పాలక పార్టీకి
వ్యతిరేఖంగా పడే ఓట్లను చీల్చి మళ్ళీ వాళ్ళే ఇతర పార్టీల సభ్యులను కొనేంత స్థాయికి వెళ్ళే పాలకులుగా
ప్రాభవం సాధించే దానికి దోహద పడింది అనేది కాదనలేని సత్యం.

అవినీతి సామ్రాట్టుల పంచలు పీకేయండి అని ప్రజలకు చెప్పి
పార్టీ టికెట్లు అమ్ముకొన్నారనే ఆరోపణలతో అభాసుపాలై తన వంతుగా
అయోమయం సృష్టించి అవినీతి పార్టీ అధికారంలో రావడానికి కృషి చేసింది మరో పార్టీ.

అంతో ఇంతో అవినీతిని అడుగడుగునా ఎండగడుతూ ఆ భాగంలో అసెంబ్లీలో
ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ పై రెండు అవినీతికి వ్యతిరేఖంగా కృషి జరిపే
పార్టీల ఓట్ల చీలికతో ప్రజల మద్దతుతో మరిన్ని స్థానాలను తమ ఖాతాలో వేసుకొని
పరిపుష్టమైన ప్రతిపక్ష పార్టీగా అవకాశం పొందింది మరో పార్టీ.

కాదేదీ అవినీతికి అనర్హం అంటూ విజృంభించిన పార్టీకి మళ్ళీ
అవకాశం అన్య పార్టీల వల్లా వచ్చినా ఆ విషయం పక్కన పెట్టి
రాబోవు కాలంలో కూడా మేమే రారాజులుగా ఉండాలని
రాచబాట వేసుకొంటూ దానిలో భాగంగా
అధికారం లేకపొతే మరేమీ తోచని ఇతర రాజకీయ పార్టీ సభ్యులను
నయానో భయానో బహిరంగంగా చెప్పి మరీ తీసుకొస్తున్నారు.

అధిక ధరలతో అల్లాడే అసాధారణ పరిస్థితులు ఒక ప్రక్క
నిశ్సబ్దంగా నీటిని నిలువరించే రాష్ట్రాలు ప్రాజెక్టులపై ప్రాజక్టులు కట్టి
సమీప భవిష్యత్తులో మన ప్రజలు నీటికి కట కట లాడే పరిస్థితులు కల్పిస్తుంటే
పోరాడితే పోయేదేం లేదని సంఘటితంగా పోరాడాల్సిన ప్రతిపక్షాలు
ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంలో,
చేజారే నాయకులను నిలువరించుకొంటూ కాలం గడుపుతుంటే
అనిపిస్తోంది, మళ్ళీ ఎన్నికలొస్తే గాని వీరు పోరాటాలు చేయరేమోనని.

2 స్పందనలు నుండి “మళ్ళీ ఎన్నికలు!” కు


  1. 1 kapil bolisetti 1:43 అపరాహ్నం వద్ద జులై 9, 2009

    Disclaimer: I am a staunch supporter of Loksatta, infact its policies
    Your statements are misguiding, “ఎన్నుకోవాలంటే మాకు తప్ప వేరెవ్వరికీ సత్తా లేదు అని
    ఒక పార్టీ దశాబ్దాల తరబడి మాట్లాడుతూ”, its about 2 and half yrs since the party has been established. To say its a revolution in the making to win atleast one seat with out distributing liquor and money is an understatement.
    The other party you are talking about why doesn’t it fight based on issues instead of going for individual allegations. Why doesn’t it expose the inefficiencies in the current policies and give alternatives? Why does it have to walkout instead of challenging the ruling party right in the assembly? Is it because of its inability ??
    Why doesn’t it take a hit at Govt’s policies like
    Arogyasree
    Issues like water contamination.
    Stringent Anti corruption laws and Whistle blowers act

    Instead all the time it talks about opposition taking away its votes.. it has no other concern than but for votes..huh!!!

  2. 2 Blackburn 2:27 అపరాహ్నం వద్ద జులై 9, 2009

    Nuvvu ee satabdham lone oka vunnatha vykthitvam vunna sngha samskarhavi anukuntunnaru janalu.Ok ok. Kani nenu okka prasna vesthanu to all JP’s followers. Which is some thing like this”Asalu tamaru faty fettina mula karanallo okati avinethi ki vyatirekham ga poradataniki. Alantidi 100% avineethiki puttina “KU”sakshi paper inaguration ki ela veltharu? Antey meru Ku sakshi ni samardisthunnatta? Mee lanti sagha samskarthalu Thummina ade follow ayye nedhavalam memu alantidi meru aa fafer opening ki velthey memu antha aa fafer white maoney tho fettina di anukutam kadha.antey mee vuddesyam maa lanti vallu ala anukovalana??Leka meru Kwangy kukkala ki todu vundey kukka?Deniki mee samadhanam emi Jpayya?


ప్రత్యుత్తరమిమ్ము




వీక్షణలు

  • 77,132

 

జులై 2009
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

నెలవారీ ఉతికినవి