ఇంటర్నెట్ కేఫ్ పెట్టి రాసలీలలు నడిపే కేంద్రాన్ని
అదే పనిగా ప్రసారం చేసి దానిని మూయించిందో తెలుగు ఛానెల్.
నిజంగా ఇది చాలా అభినందించ తగిన విషయం.
కానీ మన మీడియా ఏ ఒక్కటీ కూడా
సచివాలయంలో జరిగిన రాసలీలలకు సాక్ష్యం సంపాదించ లేక పోయింది.
వాళ్ళే రికార్డు చేసుకొని దొరికిపోతే తప్ప ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు పట్టించుకోవు.
ఎవరో ఆకతాయిలు చెప్పంగానే రెడ్ ఆక్సైడు మరకలను పట్టుకొని
రక్తపు మరకలుగా మలిచి మన మనసుకు హత్తుకొనేలా
రక రకాలుగా చెప్పి రక్తి కట్టిస్తారు.
ఒక పెద్ద ఘటన జరిగినప్పుడు పరిశోధనాత్మక కథనాలు బదులు
పలువురు ప్రముఖులను పెట్టి తమకు తోచిన రూపంలో ఊహాగానాలు చేయించి
వీనుల విందుగా వినిపిస్తున్నారు వీలయితే అక్కడే ఆరోపణలు చెయ్యిస్తున్నారు.
వీళ్ళ అవస్థలు చూస్తుంటే అసహ్యమేస్తోంది ఈమధ్య.
చాలా బాగా సెలవిచ్చారు. అసలు సమాజ వికాసానికి మీడియా ఎంతగా తోడ్పడుతుందో ఇప్పటి మీడియా వాళ్లు బొత్తిగా ఎరుగరు. ఎంతసేపు సంచలన వార్తలు, చూపించరానివి పదే పదే చూపడం లోనే ఉత్సాహం చూపుతున్నారు.
mari meeku ETV vadivi enduku kanipimchavu
karanam : KAMMA ani
Saakshi soory Congress pomplet, sudda dandaga paper
ఒక సాక్షి ఏంటి మిగతా చానల్స్ కూడా అలాగే ప్రవర్తిస్తున్నాయి. మరీ టీవీ9 ఐతే బ్రేక్ తరువాత..బ్రేక్ తరువాత అంటూ అదే పనిగా ప్రసారం చేస్తుంటుంది ఇలాంటి విషయాలు. కొంచెంలో కొంచెం ఈ2 నయం. వీళ్ళకి సమాజంలో ఉన్న సమస్యలకంటే ఏవిధంగా చానల్ రేటింగ్స్ పెంచుకునే దానిపైనే ఉంటుంది ధ్యాస అంతా.