జులై 9th, 2009ను భద్రపఱచు

పిచ్చుక పై బ్రహ్మాస్త్రం సంధించిన ఉత్తర సాక్షి

ఇంటర్నెట్ కేఫ్ పెట్టి రాసలీలలు నడిపే కేంద్రాన్ని
అదే పనిగా ప్రసారం చేసి దానిని మూయించిందో తెలుగు ఛానెల్.
నిజంగా ఇది చాలా అభినందించ తగిన విషయం.

కానీ మన మీడియా ఏ ఒక్కటీ కూడా
సచివాలయంలో జరిగిన రాసలీలలకు సాక్ష్యం సంపాదించ లేక పోయింది.

వాళ్ళే రికార్డు చేసుకొని దొరికిపోతే తప్ప ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు పట్టించుకోవు.
ఎవరో ఆకతాయిలు చెప్పంగానే రెడ్ ఆక్సైడు మరకలను పట్టుకొని
రక్తపు మరకలుగా మలిచి మన మనసుకు హత్తుకొనేలా
రక రకాలుగా చెప్పి రక్తి కట్టిస్తారు.

ఒక పెద్ద ఘటన జరిగినప్పుడు పరిశోధనాత్మక కథనాలు బదులు
పలువురు ప్రముఖులను పెట్టి తమకు తోచిన రూపంలో ఊహాగానాలు చేయించి
వీనుల విందుగా వినిపిస్తున్నారు వీలయితే అక్కడే ఆరోపణలు చెయ్యిస్తున్నారు.
వీళ్ళ అవస్థలు చూస్తుంటే అసహ్యమేస్తోంది ఈమధ్య.

తరువాతి కాగితం »


వీక్షణలు

  • 77,475

 

జులై 2009
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

నెలవారీ ఉతికినవి