మేము మీకు లంచం ఇవ్వం అలా ఇవ్వజూపని మాకు ఓట్లు వెయ్యండి అని ఎన్నికలప్పుడు మాత్రమే మాట్లాడి మిగిలిన ఐదు ఏళ్ల పాలనలో నోరు తెరవడానికి ఎందుకు సత్తా లేదు?
ప్రధాన ప్రతిపక్షం ఆరోపించిన ఆలస్యం ధర్నాలకు దిగిన సత్తా ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఏరోజూ చూపలేదు, ఎందుకు?
సాక్షాత్తూ పార్లిమెంటు లోనే సభ్యులు అమ్ముడు పోయారని ఆరోపణలు వచ్చినప్పుడు నోరు పెగలని వీరు ప్రజాస్వామ్యం అమ్ముడు పోతోంది మీరు మారండి అని మాటి మాటికీ ప్రజలను ఊదరగొట్టడం ఉత్తుత్తి మాటల ఉత్తర కుమారులని కాక నిజమైన సత్తా ఉన్న వారిగా ఎలా భావించాలి?
సేవా సంస్థను పార్టీగా రూపొందించి డొంకతిరుగుడుగా రాజకీయాల్లోకి సినిమా కథానాయకులు అనుసరించే నాటకీయ బాట అవసరమా?
కాగ్ నుంచి కోర్టుల వరకు ప్రతిపక్షాల నుండి పత్రికల వరకు అత్యంత అసమర్ధ అవినీతి పాలన నడుస్తోంది అని కోడై కూస్తుంటే మళ్ళీ వాళ్ళే పాలకులుగా రాకుండా ఆపే సత్తా లేనప్పుడు తప్పుకోక పరోక్షంగా వారి రాకకు కారణమవడం నిజంగా ప్రజలకు మేలుగా భావించాలా?
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు