తెలుగుకు న్యాయం చెయ్యడానికీ నడుంకట్టిన బ్లాగర్లారా!

బాగుండావా, బావున్నావా, బావున్నారా, కులాశా, క్షేమమా, కుశలమా, మంచిగున్నారా అని
ఇన్ని పదాలు అర్థం చేసుకొనే వాడిని పండితుడు అని పిలవాలా?

సంస్కృతం అంటే సల సల కాగే నూనె లా మరిగి పోతారు కొందరు.
ఎందుకంటే దాన్ని చదివి రాసే వాళ్ళంతా ఒక వర్గానికి చెందిన వారేనని ఒక అపోహ.
అందుకే ఆ గిట్టని వారి పేరు ఎక్కడ వినపడ్డా వారినే కాదు వాళ్ళు చేసే పనులను కూడా తిట్టేస్తారు.

యాసతో మాటాడే పల్లె తెలుగును పాఠ్యాంశంగా పెట్టి
పాఠశాలలను కూడా పర్ణశాలలు చెయ్యమని పదే పదే మొత్తుకుంటున్నారు.

చెన్నై వెళితే వారు మర్యాదలు విడిచి మన తెలుగు మాట్లాడినా మన ఛాతీ రెండు అంగుళాలు పొంగుతుంది.
బెంగుళూరులో అక్కడ మాట్లాడాల్సిన కన్నడ రాదే అని కలవర పడక
అచ్చ తెలుగులో అద్భుతంగా మాట్లాడే అవకాశం ఉంది అనే విషయం మనందరికీ తెలిసిందే.

ఇక మన భాగ్య నగరానికి వెళితే మాత్రం ‘పైసల్ తీ’ అనే కండక్టరు ను చూసి
మనం ఉన్నది ఎక్కడ అనే అనుమానం వస్తుంది.

ప్రతి నగరాంలోనూ మాట్లాడే యాస వేరు.
రాయల సీమ లోని యాస వేరు, కోస్తా యాస వేరు, తెలెంగాణా యాస వేరు.
అంతెందుకు పుంగునూరులో మాట్లాడే యాస వేరు చిత్తూరులో మాట్లాడే యాస వేరు.
బెజవాడలో వేరు బందరులో వేరు.

ఇలా జిల్లా జిల్లాను రెండు యాస భాగాలుగా విడదీసి
వాళ్ళ ఇండ్లలో మాట్లాడే ఇనసొంపైన బాషకు దగ్గరగా పాఠ్యాంశాలు తయారుచేసి తెలుగును తరింప జేయడం సాధ్యమా?

ఆ యాస నేర్చుకొన్న వాడు అక్కడే ఉపాధి వెతుక్కొని ఆ యాసతో జీవితాన్ని ముగించేస్తాడా?

చిన్నప్పటి నుండి వల్లే వేసో ఇంకో పని చేసో ఎన్నో పదాలను మనం నేర్చుకొంటాం.
కానీ అన్ని పదాలు అవసరపడవు. కొన్ని పదాలు న్యూసు పేపరు చదవడానికి
కొన్ని ఎన్ టి ఆర్ పౌరాణిక సినిమాలు చూడడానికి
మరి కొన్ని హరికథా బగావతార్ చెప్పే పద్యాలను అర్ధం చేసుకోడానికి అవసరపడతాయి.

అట్టని వ్యవస్థను తప్పు బట్టి ఆది కవుల వెంట బడటం ఎంత వరకు సమంజసం?
మాట్లాడినా బ్లాగినా మనలను పండితులు అనుకోవాలనే ఆత్రంతో అర్ధం అవుతుందో లేదో అని చూడకుండా
మన బాషా ప్రావీణ్యంతో ప్రాణాలు హరిస్తున్నాం అనే విషయం మనలను మనం ఏనాడన్నా ప్రశ్నించుకొన్నామా?
నేను మాత్రం హరించడం లేదు ఎందుకంటే మీరు ఎప్పుడో నేరుచుకొన్న పదాలను నాకు తెలిసిన పదాలతో పలకరిస్తున్నా.

5 స్పందనలు నుండి “తెలుగుకు న్యాయం చెయ్యడానికీ నడుంకట్టిన బ్లాగర్లారా!” కు


  1. 1 vinay chakravarthi 9:17 పూర్వాహ్నం వద్ద జులై 6, 2009

    maa baaga chepparu…………..
    artham chesukuntaarani aasiddam

  2. 2 Venkata Ganesh. Veerubhotla 9:52 పూర్వాహ్నం వద్ద జులై 6, 2009

    Simply superb!!

  3. 3 swamy7867 12:53 అపరాహ్నం వద్ద జులై 6, 2009

    ఇటీవల తెలుగును ప్రాచీన బాషగా గుర్తించడం, తెలుగు బాషా అమలుకు ప్రభుత్వం నడుంకట్టడం చూసి ఒక వర్గానికి కన్ను కుట్టినట్టుంది.

    అవును. వారు సంస్క్రుతం యొక్క గొప్పదనాన్ని మనకు చెప్పి దానికి జన సమీకరణ చేస్తున్నారు.

    సంస్క్రుతం చచ్చి పోయిన బాషా.(జన బాహుళ్యం వ్యవహరించని బాషను ఇంకేమనాలి) ఆ బాష జన బాహుళ్యానికి అర్థం కాక పోవడంతోనే ఒక వర్గం ఆ బాషలోని చెత్తలను మన నెత్తి మీద పోసి పబ్బం కడుక్కుంటూంది.

    నేను పండితుడను కాక పోయినా గొప్ప విషయం ఏ బాషలో ఉన్నా దానిని ప్రజల వద్దకు తీసుకెళ్ళాలనే తత్వం గలవాడ్ని. గుండు పగల కొట్టుకుని మరి పరిశీలిస్తే అంతా రిపీటన్స్, తర్క రహితంగానే ఉన్నాయి.

    పెదవులంటే ఒకే సిమిలి హీరోయిన్ పెదాలన్న అంతే ,దేవత పెదాలన్నా అంతే , లస్ఖ్మికి అదే సిమిలి, పార్వతికి అదే సిమిలి.

    దానిని దేవతా బాష అంటున్నారు. కాదు కాదు అది రాక్షస బాష.

    కథా కాలక్షేపాల్లో మద్య మద్యన సంస్క్రుత శ్లోకాలు వల్లించే వారిని చూడండి. గొంతెండి పోయి అడుగడుగున పాలతో గొంతు తడుపుకుంటుంటారు.

    పాలు ఎవరికి పోస్తారు తెలుసుగా ?

  4. 4 vinay chakravarthi 4:31 పూర్వాహ్నం వద్ద జులై 8, 2009

    adi kannu kuttinatlu naaku anipinchaledu just publicity stunt

    edo oka controversary topic teesukoni manalni confuse chesi memu turum denlonina ani anipinchukovali ani aturata…….

    valla valla streams lo baaga podiste anta kante turumlu ani meme manaspoorthiga natam

    paalu pillalu kooda taagutaaru…………

    prati language lo teeyadanam vutundi
    naaku hindi malayalam raadani avi naasanam kaavalante ela
    malayalam enta manchilyrics raastaro ma friend oka song explain cheste telisindi…………

    even lambadi bhashalokkoda teeyadanam vuntundi ………

    evadi language vallaki ekkuva but first lo naaku vellu manchi pani chestunnaru anipinchi daily inorakamga cheppalante slave ayyanu koodaliki

    but ee madhya andaru nenu blog petti year naa hits inni ani choostunte public stunt anipinchindi annamata

    anni bhashalu batakaalani andaru vall mother tongue marchi pokoodadani krukuntu

  5. 5 madhoos 10:58 పూర్వాహ్నం వద్ద జులై 14, 2009

    intaki oka vargam oka vargam antunnaru?yevara vargam?


ప్రత్యుత్తరమిమ్ము




వీక్షణలు

  • 77,132

 

జులై 2009
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

నెలవారీ ఉతికినవి